High Court : తల్లి ఆస్తిలో కూతురికి హక్కు లేదు.. హైకోర్టు కీలక నిర్ణయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

High Court : తల్లి ఆస్తిలో కూతురికి హక్కు లేదు.. హైకోర్టు కీలక నిర్ణయం..!

High Court  : హైకోర్టు కొత్త తీర్పు కూతుళ్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆస్తి హక్కు విషయంలో చట్టపరమైన సరిహద్ధులు స్పష్టం చేస్తూ తీర్పుని ఇచ్చింది. ఆస్తి యాజమాన్యం ఇంకా హక్కుల విషయంలో తరచు ఫ్యామిలీల్లో వివాదాలు వస్తుంటాయి. ఆ గందరగోళాన్ని పరిష్కరించేలా తండ్రి ఆస్తి పిల్లల వారసత్వ హక్కుల గురించి కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించింది. తల్లి ఆస్తిలో కూతురికి ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఆస్తి హక్కు సంబందిత చట్టలపై అవగాహన లేకపోవడం పై […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 November 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  High Court : తల్లి ఆస్తిలో కూతురికి హక్కు లేదు.. హైకోర్టు కీలక నిర్ణయం..!

High Court  : హైకోర్టు కొత్త తీర్పు కూతుళ్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆస్తి హక్కు విషయంలో చట్టపరమైన సరిహద్ధులు స్పష్టం చేస్తూ తీర్పుని ఇచ్చింది. ఆస్తి యాజమాన్యం ఇంకా హక్కుల విషయంలో తరచు ఫ్యామిలీల్లో వివాదాలు వస్తుంటాయి. ఆ గందరగోళాన్ని పరిష్కరించేలా తండ్రి ఆస్తి పిల్లల వారసత్వ హక్కుల గురించి కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించింది. తల్లి ఆస్తిలో కూతురికి ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఆస్తి హక్కు సంబందిత చట్టలపై అవగాహన లేకపోవడం పై ఫ్యామిలీస్ లో ఒక రకమైన గందరగోళాన్ని సృష్టిస్తాయి. చట్టం యొక్క అపార్ధాలు భిన్నమైన వివరాల వల్ల ఈ పరిస్థుతులు కోర్టుకి వెళ్లేలా చేస్తాయి.

తాజాగా ఒక కేసులో తల్లి ఆస్తికి సంబందించి కూతురు, ఆమె భర్త ఆస్తి హక్కు కోసం హైకోర్టుని ఆశ్రయించారు. కేసు పరిశీలించిన వారు తమ పేరిట ఉన్న ఆస్తి తప్ప ప్రత్యేకమైన హక్కులు ఉండదని స్పష్టం చేసింది. ఢిల్లీలో శాస్త్రి నగర్ లో 85 ఏళ్ల వృద్ధురాలు 1985 లో ఆస్తిలో కొంత భాగం వాడుకునేందుకు కూతురికి ఇచ్చింది. ఐతే ఇప్పుడు ఆ ఆస్తి తమదే అంటూ వారు కోర్టుని ఆశ్రయించారు. ఐతే తల్లి ఆస్తిపై ఆమె అనుమతిలేనిదే ఆ ఆస్తి ఎవరికి చెందదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు ఇన్నాళ్లు ఆమె ఇంట్లో ఉన్నందుకు కోర్టు తిరిగి కూతురు అల్లుడికి ఆమెకు నెల నెల 10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.

High Court తల్లి ఆస్తిలో కూతురికి హక్కు లేదు హైకోర్టు కీలక నిర్ణయం

High Court : తల్లి ఆస్తిలో కూతురికి హక్కు లేదు.. హైకోర్టు కీలక నిర్ణయం..!

స్త్రీ ప్రత్యేక హక్కులో భాగంగా భర్త లేదా వారసత్వ ఆస్తి తల్లి ఇష్టానుసారంగా ఇవ్వడమే తప్ప అది కూతురికి వారసత్వంగా వచ్చే అవకాశం లేదు. ఆ ఆస్తి మీద ఆమెకే పూర్తి యజమానత్వం ఉంటుంది. ఈ తీర్పు ప్రకారం కూతురు అల్లుడు వారి కుటుంబ సంబణాల కారణంగా ఆస్తిపై ఆటోమెటిక్ హక్కులు వారసత్వంగా పొందరని స్పష్టం చేసింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది