Gupta Samrajyam : గుప్త సామ్రాజ్యం గురించి శాసనాలు ఏం చెబుతున్నాయి..!
Gupta Samrajyam : ప్రాచీన భారత దేశాన్ని ప్రజాంజకంగా శాంతియుతంగా స్థిరంగా పాలించి అభివృద్ధి చేసిన వాళ్లలో గుప్తులు కూడా ఉన్నారు. అందుకే గుప్తుల పాలన స్వర్ణ యుగంగా చెప్పుకుంటారు. ఉపఖండంలో మౌర్యులు వల్ల ఏర్పరచిన రాజకీయ స్థిరత్వాన్ని గుప్తులు సాధించారు. ఈ వంశపు రాజుల పాలన లో భారతీయ సంస్క్రుతి, సాహిత్యం, కళలు, విద్యా రంగం, శాస్త్రీయ విజ్ఞానం ఇలా అన్ని రంగాల్లో ఉన్నంత శుఖరాలు చేరుకున్నాయి. అంతేకాదు కవులు, పరిశోధకులు, పండితులు ఇలా ప్రపంచానికి […]
ప్రధానాంశాలు:
Gupta Samrajyam : గుప్త సామ్రాజ్యం గురించి శాసనాలు ఏం చెబుతున్నాయి..!
Gupta Samrajyam : ప్రాచీన భారత దేశాన్ని ప్రజాంజకంగా శాంతియుతంగా స్థిరంగా పాలించి అభివృద్ధి చేసిన వాళ్లలో గుప్తులు కూడా ఉన్నారు. అందుకే గుప్తుల పాలన స్వర్ణ యుగంగా చెప్పుకుంటారు. ఉపఖండంలో మౌర్యులు వల్ల ఏర్పరచిన రాజకీయ స్థిరత్వాన్ని గుప్తులు సాధించారు. ఈ వంశపు రాజుల పాలన లో భారతీయ సంస్క్రుతి, సాహిత్యం, కళలు, విద్యా రంగం, శాస్త్రీయ విజ్ఞానం ఇలా అన్ని రంగాల్లో ఉన్నంత శుఖరాలు చేరుకున్నాయి. అంతేకాదు కవులు, పరిశోధకులు, పండితులు ఇలా ప్రపంచానికి భారతీయ ప్రతిభను చాటేలా చేశారు. ఆలయాల నిర్ణాణంతో హైదవ మత స్థిరవానికి గుప్తులు పునాదులు వేశారు. రెండు శాతాబ్ధాల పాలనలో గుప్తులు రాజ్య పరిధి, సామాజిక ఆర్ధిక పరిస్థుత్లు, పాలనా పద్ధతులు గొప్పగా ఉండేవి.
మౌర్యుల అనంతరం ఉత్తర భారదేశంలో కుషాణులు పరిపాలించారు. క్రీ.శ.3వ శతాబ్ధం మధ్యలో వారు పతనమయ్యారు కుషాణుల తర్వాత ఉత్తర భారంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడగా క్రీ.శ.4వ శాతాబ్ధిలో గుప్త సామ్రాజ్యం లో విదేశీ శక్తులను రూపుమాపి దిగ్విజయ యాత్రలు నిర్వహించారు. గుప్తులు క్రీ.శ. 4వ శతాబ్ధం ప్రథమార్ధం నుంచి 6వ శతాబ్ధం ప్రథమార్ధం వరకు పాలించారు. గుప్త రాజుల్లో ముఖ్యమైన వారు శ్రీ గుప్తుడు ఆయన్ను మూలపురుషుడు అని కూడా అంటారు. ఆ తర్వాత ఘటోత్కచ గుప్తుడు, మొదటి చంద్ర గుప్తుడు, సముద్రగుప్తుడు, రెండో చంద్ర గుప్తుడు, కుమార, స్కంద గుప్తుడు ముఖ్యమైన వారు. వీరినే ఘనులైన గుప్తులు అంటారు. ఐతే గుప్త సామ్రాజ్యం అంతం అవడానికి వివిధ రచన్లు సాహిత్య ఆధారాలు ఉన్నాయి. పురావస్తు ఆధారాలు కూడా ఉన్నాయి.
ప్రాచీన భారతదేశ చరిత్ర రచనకు కొన్ని శాసనాలు ద్వారా అందించిన సమాచారం ఎంతో ముఖ్యమైంది. గుప్తుల కాలంలో రాజకీయ పరిస్థితి అప్పటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ శాసనాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.