Shoaib Akhtar : మళ్లీ మాదే పైచేయి… ఇప్పుడే ఎందుకు బాస్ అంటూ నెటిజన్లు ట్రోల్స్..!
Shoaib Akhtar : టి20 ప్రపంచకప్ 2022లో లీగ్ దశలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి అందరికీ విదితమే. ఈ ఏడాది అక్టోబర్ 23న టీమిండియా, పాకిస్థాన్ మెల్ బోర్న్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ జరగడానికి ఇంకా 9 నెలల టైం ఉంది. అయినప్పటికీ పాక్ ఆటగాళ్లు ఇప్పటి నుంచే కత్తులు దూస్తున్నారు.గతంలో పాక్ ఆటగాళ్లు భారత్ పైన పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా షోయబ్ అక్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి కూడా విజయం తమేదనని, మెల్ బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధిస్తుందని అన్నాడు.
ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా భారత మీడియా పని గట్టుకుని టీమిండియాపై ఒత్తిడి చేస్తుందని కామెంట్ చేశాడు. అలా ఒత్తిడి చేయడం వల్లే , అది తమకు అనుకూలంగా మారుతున్నదని, అలా తామే గెలుస్తున్నామని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌కు అంత సీన్ లేదని, ఈసారి టీమిండియాదే పై చేయి అవుతుందని అంటున్నారు. మ్యాచ్ జరగడానికి ఇంకా తొమ్మిది నెలల టైం ఉందని, ఇప్పుడే అంత తొందరెందుకు అక్తర్ దానికి ఇంకా చాలా టైం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
Shoaib Akhtar : ఇప్పటి నుంచే కత్తులు దూస్తున్న పాక్ ఆటగాళ్లు..
గతేడాది టీ20 ప్రపంచకప్ 2021 లీగ్ దశలో భారత్ తన దాయాది దేశమైన పాక్ చేతిలో ఘోర ఓటమి పాలయిన సంగతి అందరికీ విదితమే. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. నవంబర్ 9న తొలి సెమి ఫైనల్, నవంబర్ 10న రెండో సెమీఫైనల్ జరుగనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా నవంబర్ 13న జరగనుంది. ఈ సారి జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయం గ్యారెంటీ అని టీమిండియా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.