Shoaib Akhtar : అదే మాకు మీకు తేడా.. భారత బౌలర్లపై షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు..
Shoaib Akhtar : పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ భారత ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలోనూ ఇటువంటి వ్యాఖ్యలు చేసిన షోయబ్ అక్తర్.. ఈసారి భారత బౌలర్లను కించపరిచేలా వ్యాఖ్యానించాడు. భారతీయ బౌలర్లు, పాకిస్థాన్ బౌలర్లను కంపార్ చేస్తూ షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు చేశాడు.టీమిండియా పేసర్లను ఉద్దేశించి షోయబ్ అక్తర్ ఈ విధంగా మాట్లాడాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో పాకిస్థాన్ పేసర్లదే ఆధిపత్యం అని తెలిపారు. ఈ క్రమంలోనే భారతీయుల ఆహారపు అలవాట్లను కించపరుస్తూ మాట్లాడాడు. ఇటీవల కాలంలో భారత పేస్ దళం బాగా పుంజుకున్నప్పటికీ కొన్ని విషయాల్లో పాకిస్థాన్ పేసర్లతో పోలిస్తే బాగా వెనకపడి ఉందని పేర్కొన్నాడు.
తమ ఫుడ్ హ్యాబిట్స్ మూలంగానే వారు అలా బలహీనంగా ఉంటారని అన్నాడు. పాకిస్థాన్ పేసర్ల ముఖాల్లో కనిపించే కసి, యాటిట్యూడ్ భారత పేస్ బౌలర్లలో ఉండబోదని అన్నాడు. ఈ డిఫరెన్స్ కు ప్రధాన కారణం ఫుడ్ హ్యాబిట్స్, ఎన్విరాన్ మెంట్ అని అన్నాడు.ఈ క్రమంలోనే పాకిస్థాన్ బౌలర్లను ప్రశంసించాడు. పాకిస్థాన్ బౌలర్లు బౌలింగ్ చేసే టీంలో ఇతర విషయాల గురించి అస్సలు ఆలోచించబోరని, బ్యాటర్ ను చంపైనా సరే వికెట్ తీయడమే లక్ష్యంగా బౌలింగ్ చేస్తారని అన్నాడు. ఈ యాటిట్యూడ్ వల్లే వేగంగా బంతులు వస్తాయని, అందుకు కావాల్సిన శక్తి వస్తుందని చెప్పాడు.

shoaib akhtar controversial comments on tem india bowlers
Shoaib Akhtar : ఆ విషయంలో భారత బౌలర్లు వెనుకబడ్డారు…
ఇకపోతే తాము మాంసాహారం తింటామని, అందుకే దృఢంగా ఉంటామని, అలా తాము సింహాల్లా పరిగెడుతామని అన్నాడు. ప్రజెంట్ జనరేషన్ పాకిస్థాన్ పేసర్లలో షాహీన్ ఆఫ్రిదీ, హసన్ ఆలీల్లో ఈ లక్షణాలు స్పష్టంగా కనబడుతాయని వివరించాడు.ఇకపోతే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో టీమిండియాకు బెస్ట్ పేసర్లు ఉన్నారని టీమిండియా క్రికెట్ అభిమానులు అంటున్నారు. టీమిండియాకు ఉన్నంత పేస్ యూనిట్ ఏ టీమ్ కు లేదని చెప్తున్నారు.మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, టి నటరాజన్ వంటి పేసర్లతో భారత పేస్ విభాగం చాలా బలంగా ఉందని అంటున్నారు.