ఒకే మహిళా ఎంత మందినైనా పెళ్లాడవచ్చు.. దక్షిణాఫ్రికా కీలక చట్టం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఒకే మహిళా ఎంత మందినైనా పెళ్లాడవచ్చు.. దక్షిణాఫ్రికా కీలక చట్టం

 Authored By brahma | The Telugu News | Updated on :1 July 2021,11:00 am

సౌత్ ఆఫ్రికా లో ఉండే ఫ్రీడమ్ కానీ, ఉదారంగా రాజ్యాంగం కానీ, ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేదనే చెప్పాలి. ఇలాంటి దేశంలో మరో కొత్త చట్టం రాబోతుంది. మహాభారతం లో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నారని మనం విన్నాం. కానీ నేటి సమయంలో అలాంటి ఆచారం తప్పు. అదే సమయంలో ఒక మగాడు ఎంతమందినైనా పెళ్లాడవచ్చు అనే సంప్రదాయం ఇప్పటికి కొన్ని తెగల్లో, కొన్ని దేశాల్లో ఉంది. సౌత్ ఆఫ్రికా లో కూడా మగాడు ఎన్ని పెళ్లిళ్లు అయిన చేసుకోవచ్చు అనే చట్టం ఉంది.

multiple husbands

ఇక ఇప్పుడు కొత్తగా మహిళలకు అలాంటి చట్టం తీసుకోని రాబోతుంది అక్కడి ప్రభుత్వం మహిళలు పలువురిని పెళ్లాడేందుకు చట్టబద్ధమైన అనుమతులు ఇవ్వాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైలు కూడా రెడీ అయింది. బహుభర్తృత్వంపై ప్రజాభిప్రాయాలను స్వీకరించేందుకు ఆ గ్రీన్ పేపర్ జారీ చేసింది. బహుభర్తృత్వంపై ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టింది. ఈ రోజు (జూన్ 30) చివరి రోజు కావడంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వారికి నచ్చిన రీతిలో వారు స్పందించేందుకు అక్కడ వీలుంది. అయితే ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వం తీసుకు వస్తున్న చట్టంకు అనుకూలంగా ఓటు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలు కూడా ఇందుకు అనుకూలంగా ఓటు వేస్తుండటంతో ఆ సెంటర్ల వద్ద మంచి ఉత్సాహం నెలకొంది.

POLYANDRY: Bill to Allow Women to Marry Two Husbands, Is Under review. -  The Gazette (Nigeria) - News Updates, Opinions, and Trending stories

దక్షిణాఫ్రికాలో పురుషులు, మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న వారు ఈ ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేస్తుండగా, సంప్రదాయవాదులు, మత సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. బహుభర్తృత్వం ద్వారా పుట్టే పిల్లలకు తండ్రి ఎవరనేది ఎలా తెలుస్తుందని అక్కడి బుల్లితెర ప్రముఖ నటుడు మౌసా సెలేకూ ప్రశ్నించారు. ఆయన నలుగురు భార్యలకు భర్త. బహుభర్తృత్వం వల్ల దేశ సంస్కృతి నాశనం అవుతుందని అన్నారు. బహుభార్యత్వం ఆమోదం పొందిన ఆచారమని, కానీ బహుభర్తృత్వానికి ఆమోదం లేదని ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమొక్రటిక్ పార్టీ నేత కెన్నెత్ మెషో పేర్కొన్నారు. పురుషాధిక్య ప్రపంచంలో బహుభర్తృత్వం చెల్లదని అభిప్రాయపడ్డారు.

ఇలా అనేక వాదనలు వినిపిస్తున్న కానీ చివరికి బహుభర్తృత్వం వైపే అక్కడి ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెపుతున్న మాట. నేటి కాలం యువత మాత్రం తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలాంటి చట్టాలు ప్రపంచంలోని అన్ని దేశాల్లో రూపు దిద్దుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఏదేమైనప్పటికీ బహుభార్యత్వం మాత్రం చట్టంగా మారబోతోంది. ఇప్పటికే అక్కడ స్వలింగ వివాహాలు, బహుభార్యత్వం అమల్లో ఉంది. తాజాగా బహుభర్తృత్వంపై వచ్చిన ప్రతిపాదనను స్వీకరించడం ద్వారా సంచలనం సృష్టించింది.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది