Chocolate | చాక్లెట్ అంటే ఇష్టం లేనివాళ్లు అరుదు .. కానీ వయస్సు బట్టి ఎంత తినాలో తెలుసా?
Chocolate | చాక్లెట్ అనేది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రియమైనదే. మనసుకు తక్షణ ఆహ్లాదాన్ని అందించే ఈ మిఠాయి చిన్న ముక్కతోనే ఆనందాన్ని పంచుతుంది. అయితే చాక్లెట్ తింటున్నప్పుడు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇందులో చక్కెర, కెఫిన్, అధిక కాలరీలు ఉండటంతో ఇది సరిమితంగా తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా వయస్సును బట్టి ఎంత చాక్లెట్ తినవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
#image_title
6 ఏళ్లలోపు పిల్లలు
చిన్నారుల శరీరం చక్కెర, కెఫిన్‌కు అత్యంత సున్నితంగా ఉంటుంది.
1–2 ఏళ్ల పిల్లలు: వారానికి 1–2 సార్లు 5 గ్రాముల వరకూ చాక్లెట్ ఇవ్వొచ్చు.
3–5 ఏళ్ల వయస్సు: వారానికి 2–3 సార్లు 5–10 గ్రాముల వరకూ ఇవ్వడం సురక్షితం.
డార్క్ చాక్లెట్ కాకుండా 25% కంటే తక్కువ కోకో కలిగిన మిల్క్ చాక్లెట్ ఇవ్వాలి.
6–18 ఏళ్ల పిల్లలు
6–12 ఏళ్లు: రోజుకు 10–20 గ్రాముల వరకు చాక్లెట్ తినొచ్చు. కానీ ప్రతి రోజూ ఇవ్వాల్సిన అవసరం లేదు.
13–18 ఏళ్ల టీనేజర్లు: రోజుకు 20–30 గ్రాముల వరకు తినవచ్చు.
60% కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌ను ఎంచుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందుతాయి.
పెద్దలు & వృద్ధులు
శరీర బరువు 50–80 కిలోల మధ్య ఉంటే, రోజుకు 25–40 గ్రాములు చాక్లెట్ తీసుకోవచ్చు.
70% లేదా అంతకంటే ఎక్కువ కోకో కలిగిన డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యానికి మంచిది.
వృద్ధులు (60+) అయితే రోజుకు 20–30 గ్రాముల వరకూ తినొచ్చు.
కెఫిన్‌కు సున్నితులైతే మిల్క్ చాక్లెట్ తీసుకోవడం బెటర్.
బరువును బట్టి లెక్క
మీ బరువులో ప్రతి కిలోకి 0.3 నుంచి 0.5 గ్రాముల వరకూ చాక్లెట్ తినొచ్చు.
ఉదాహరణకు: 60 కిలోల బరువు ఉన్నవారు రోజుకు 18–30 గ్రాముల వరకు తీసుకోవచ్చు.