Fainting : ఫేంటింగ్ అంటే తెలుసు కదా. ఒక్కసారిగా ఒళ్లు తిరిగిపోయి కింద పడిపోతారు. దాన్నే మెడికల్ భాషలో షాక్ అంటారు. అసలు.. షాక్ ఎందుకొస్తుందో తెలుసా? శరీరంలో రక్తపోటు ఒక్కసారిగా తగ్గిపోతే అప్పుడే షాక్ వస్తుంది. దీంతో సదరు వ్యక్తి వెంటనే ఫేంట్ అయి కింద పడిపోతాడు. బీపీ లేవల్స్ తగ్గినప్పుడే కాకుండా.. ఒక్కసారిగా శరీరంలో ఏదైనా నొప్పి కలిగినా.. ఒళ్లు బాగా కాలినా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్తం ఎక్కువగా పోయినా కూడా మనుషులు కింద పడిపోతారు. అలాగే.. ఒంట్లో నీటి శాతం అమాంతం తగ్గినా కూడా ఫేంట్ అవుతారు. దాన్నే డీహైడ్రేషన్ అంటాం.
అయితే.. ఫేంట్ అవడానికి ముందు.. శరీరంలో కొన్ని లక్షణాలు కలుగుతాయి. శరీరం కొన్ని సిగ్నల్స్ ను పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ ను బట్టి మనిషి షాక్ కు గురయ్యే అవకాశం ఉందని గ్రహించాలి. ఆ సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే.. కళ్లు తిరిగి కింద పడిపోయిన వ్యక్తిని మళ్లీ యథా స్థానానికి తీసుకురావచ్చు.
బయటికి వెళ్లినప్పుడు కానీ.. ఇంట్లో ఉన్నప్పుడు కానీ.. నడుస్తున్నప్పుడు కానీ.. ఒకేసారి నీరసం వచ్చేస్తుంది. ఆ సమయంలో నడవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. నీరసం వస్తుంది. దీంతో వెంటనే స్పృహ తప్పి పడిపోతారు. ఒక్కసారిగా రక్తపోటు పడిపోవడం, ఒళ్లు చల్లగా మారడం జరుగుతుంది. ఎక్కువగా దాహం వేయడం.. ఎన్ని నీళ్లు తాగినా కూడా ఇంకా దాహం వేయడం, డీహైడ్రేషన్ కు గురి కావడం జరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే.. షాక్ కు గురయ్యే ప్రమాదం ఉన్నట్టు తెలుసుకోవాలి.
ఒకవేళ ఎవరైనా కళ్లు తిరిగి స్పృహ తప్పి పడిపోయినా.. షాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసినా.. ఆ వ్యక్తిని పడుకోబెట్టి.. కాళ్లను ఎత్తుగా ఉండేలా పడుకోబెట్టాలి. బాగా గాలి ఆడేలా చేయాలి. శ్వాసను మంచిగా పీల్చుకునేలా అవకాశం ఇవ్వాలి. ఆ వ్యక్తి స్పృహలో ఉంటే మాత్రం కాసిన్ని గోరు వెచ్చని నీళ్లు ఇవ్వొచ్చు. స్పృహలో లేకపోతే మాత్రం కాసేపు పడుకోబెట్టి.. ముఖం మీద కాసిన్ని నీళ్లు కొడితే ఆ వ్యక్తి లేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తిని వెంటనే సమీపంలోని డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. ఆ వ్యక్తి కింద పడితే… ఏవైనా గాయాలు అయ్యాయో చూసి.. వెంటనే ప్రథమ చికిత్స చేయాలి.
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?
ఇది కూడా చదవండి ==> ఎక్కిళ్లు వేధిస్తున్నాయా? వాటిని చిటికెలో ఇలా తగ్గించే చిట్కాలు ఇవే..!
ఇది కూడా చదవండి ==> జుట్టు తీగ వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> వామును ఇలా తీసుకున్నారంటే.. ఒక్క నెలలోనే 20 కేజీలు తగ్గుతారు..!
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.