Hiccups : ఎక్కిళ్లు వేధిస్తున్నాయా? వాటిని చిటికెలో ఇలా తగ్గించే చిట్కాలు ఇవే..!
Hiccups : ఎక్కిళ్లు తెలుసు కదా. ఏదో పనిలో ఉన్నప్పుడు సడెన్ గా చెప్పాపెట్టకుండా ఎక్కిళ్లు వస్తుంటాయి. అన్నం తినేటప్పుడు కూడా ఎక్కువగా ఎక్కిళ్లు వస్తుంటాయి. అప్పుడు ఎవరో తలుచుకుంటున్నారు అని అనుకుంటారు. ఎక్కువగా ఎక్కిళ్లు వస్తున్నా కూడా అందరూ తలుచుకుంటున్నారని లైట్ తీసుకుంటారు. కాసిన్ని నీళ్లు తాగి వదిలేస్తారు. కానీ.. ఎక్కిళ్లు ఎక్కువగా వస్తే మంచిది కాదట. ఎక్కిళ్లు వచ్చినప్పుడు లంగ్స్, గుండె ఎఫెక్ట్ అవుతాయట. అందుకే.. ఎక్కిళ్లు వచ్చినప్పుడు వాటిని వెంటనే తగ్గించుకునే ఉపాయం చేయాలి కానీ.. ఎక్కిళ్లు వస్తున్నాయి కదా అని సంతోష పడకూడదు.

home remedies tips for hiccup issue
మామూలుగా ఎక్కిళ్లు వచ్చినప్పుడు వెంటనే తగ్గిపోతాయి. కాసిన్ని మంచినీళ్లు తాగినా తగ్గిపోతాయి. అయితతే.. ఎక్కువ సార్లు ఎక్కిళ్లు వస్తే మాత్రం.. ప్రాణాయామం చేస్తే వెంటనే తగ్గిపోతాయి. కొందరికి ఎక్కిళ్లు ఏం చేసినా అస్సలు తగ్గవు. అటువంటి వాళ్లు కొన్ని చిట్కాలు పాటిస్తే వెంటనే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
Hiccups : అసలు ఎక్కిళ్లు ఎలా వస్తాయి?
లంగ్స్ లో ఫ్రీనిక్ అనే ఓ నాడి, వేగస్ అనే మరో నాడి ఇవన్నీ కలిసి.. గొంతులోని కండరాలను కదిలిస్తాయి. దాని వల్ల ఎక్కిళ్లు వస్తాయి. ఒక్కోసారి ఆందోళనగా ఉన్నా.. చిరాకుగా ఉన్నా.. నిద్రపట్టకపోయినా కూడా ఎక్కిళ్లు వస్తాయి. మానసిక ఒత్తిడికి గురయినా కూడా ఎక్కిళ్లు వస్తాయి. ఎక్కువ పులుపు ఉన్న ఆహారాన్ని తీసుకున్నా ఎక్కిళ్లు వస్తాయి. ఎక్కువ నూనె ఉన్న ఆహారాన్ని తీసుకున్నా కూడా ఎక్కిళ్లు వస్తాయి.

home remedies tips for hiccup issue
Hiccups : ఎక్కిళ్లు తగ్గడానికి ఏం చేయాలి?
పదే పదే ఎక్కిళ్లు వస్తే మాత్రం.. ఈ చిట్కాలను పాటించాలి. బార్లీ గింజలు తెలుసు కదా. వాటిని బాగా ఉడికించి.. వాటిలో కాసింత పెరుగు పోసి.. చిలకాలి. అది మజ్జిగలా అవుతుంది. అప్పుడు దాన్ని తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి. యోగాసనాలు వేసినా.. మెడిటేషన్ చేసినా ఎక్కిళ్లు తగ్గుతాయి. కొబ్బరి పాలు తాగినా కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి. జొన్నలతో చేసిన పేలాలు, బిరియాని ఆకు, మరమరాలను తిన్నా కూడా ఎక్కిళ్లు తగ్గుతాయి.

home remedies tips for hiccup issue
ఎక్కిళ్లు పదే పదే వేధిస్తే.. ధనియాలు, జీలకర్ర, శొంఠితో చేసిన మిశ్రమంలో కాసింత ఉప్పు వేసి దాన్ని నిల్వ చేసుకొని ఎక్కిళ్ల సమస్య వచ్చినప్పుడు ఒక స్ఫూన్ మిశ్రమాన్ని గ్లాస్ మజ్జిగతో కలిపి తీసుకోవాలి. ఎక్కిళ్లు ఎప్పుడు వచ్చినా.. ఇలా చేస్తే వెంటనే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?
ఇది కూడా చదవండి ==> వామును ఇలా తీసుకున్నారంటే.. ఒక్క నెలలోనే 20 కేజీలు తగ్గుతారు..!
ఇది కూడా చదవండి ==> జుట్టు తీగ వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> పెరుగును తెగ లాగించేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు?