Scorpion Bite : జుట్టు తీగ వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు..!
మనం రోజు చూసే మొక్కల్లో కావచ్చు తీగ జాతికి చెందిన ఆకుల్లో కావచ్చు, అనేక రకాలైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోవబోయే మొక్క పేరు జుట్టు తీగ లేదా దుష్ట తీగ అని పిలుస్తారు. దీనిని పెర్గులారియా డేమియా అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా రోడ్డు సైడ్ దొరుకుతాయి. ఉష్ణ దేశాల్లో ఉపఉష్ణ మండలాల్లో ఎక్కువగా లభిస్తుంది. దీనిని ట్రేలిస్ వైన్ అని కూడా అంటారు. ఈ చెట్టు యొక్క ఆకులను గాయాలైనప్పుడు, చెవి చీము పట్టి దుర్వాసన వస్తున్నప్పుడు ఈ ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు.
ఈ ఆకులను చెట్టు నుండి తుంచినప్పుడు తెల్లటి పాల వంటి రసం వస్తుంది. ఇది పొడవుగా నిటారుగా వెంట్రుకులతో కప్పబడి ఉంటాయి. ఈ ఆకులను గుర్తుపట్టటం చాలా సులభం. ఇవి పచ్చటి పసుపు లేదా తెలుపు, తీపి సువాసన కలిగి ఉంటాయి. ఈ మొక్క మొత్తం అనేక ఔషధ గుణాలు నిధి అనే చెప్పవచ్చు. జలుబు, జ్వరం, ఉబ్బసం, టైటనస్, కుష్ఠు, కండరాల నొప్పి, కాలేయ వ్యాధి , పాము కాటు, మలేరియా జ్వరం, స్త్రీల సమస్యలు, శిశు విరోచనాలు, అల్సర్ లాంటివి తగ్గించటంలో బాగా ఉపయోగపడుతాయి.
టర్బెనాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు,స్టెరొల్స్ ,కార్డేనోలైడ్స్ ,అల్ఫా – అమిరాన్ , బీటా స్టెరాల్డ్స్ ,సాపోనియన్లు, ఫైటో కెమికల్స్ గ్లూకోసైడ్లు, లాంటి రసాయనాలను ఈ చెట్టు యొక్క కొమ్మలు, వేర్లు కాయల నుండి పొందవచ్చు. ఈ మొక్క యొక్క యాంటీ ఇంఫ్లమ్మెటరి, హెపాటో ప్రొటెక్టీవ్, యాంటీ క్యాన్సర్ ,యాంటీ డయాబెటిక్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ , బాక్టీరియల్, యాంటీ ఫంగల్, మరియు వంధ్యత్వం రాకుండా చేస్తుంది.
రెండు లేదా మూడు గ్రాముల ఆకుల పొడి తీసుకోండి, లేదా 5 నుండి 10 మి.లీ తాజా ఆకురసాన్ని తేనెతో కలిపి ఏడూ నుండి పది రోజులు తీసుకుంటే జలుబు, దగ్గు, ఫ్లూ,ఆస్తమా, మొదలైన వాటిని నయం చేయటానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ చెట్టు యొక్క వేరు భాగం అంగస్తంభన, వీర్యవృద్ధి లాంటి విషయాల్లో బాగా ఉపయోగపడుతుంది. మరియు తేలు లేదా పాము కుట్టినప్పుడు ఈ వేరును బాగా అరగదీసి, కుట్టిన చోట లేపనంగా వేస్తారు. ఈ లేపనం వలన విష ప్రభావం తగ్గుతుంది.
ఇది కూడా చదవండి ==> ఎక్కిళ్లు వేధిస్తున్నాయా? వాటిని చిటికెలో ఇలా తగ్గించే చిట్కాలు ఇవే..!
ఇది కూడా చదవండి ==> వామును ఇలా తీసుకున్నారంటే.. ఒక్క నెలలోనే 20 కేజీలు తగ్గుతారు..!
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?
ఇది కూడా చదవండి ==> పెరుగును తెగ లాగించేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు?