Fainting : అసలు షాక్ ఎందుకొస్తుంది? వస్తే ఏం చేయాలి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fainting : అసలు షాక్ ఎందుకొస్తుంది? వస్తే ఏం చేయాలి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

 Authored By jagadesh | The Telugu News | Updated on :4 July 2021,11:00 am

Fainting : ఫేంటింగ్ అంటే తెలుసు కదా. ఒక్కసారిగా ఒళ్లు తిరిగిపోయి కింద పడిపోతారు. దాన్నే మెడికల్ భాషలో షాక్ అంటారు. అసలు.. షాక్ ఎందుకొస్తుందో తెలుసా? శరీరంలో రక్తపోటు ఒక్కసారిగా తగ్గిపోతే అప్పుడే షాక్ వస్తుంది. దీంతో సదరు వ్యక్తి వెంటనే ఫేంట్ అయి కింద పడిపోతాడు. బీపీ లేవల్స్ తగ్గినప్పుడే కాకుండా.. ఒక్కసారిగా శరీరంలో ఏదైనా నొప్పి కలిగినా.. ఒళ్లు బాగా కాలినా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్తం ఎక్కువగా పోయినా కూడా మనుషులు కింద పడిపోతారు. అలాగే.. ఒంట్లో నీటి శాతం అమాంతం తగ్గినా కూడా ఫేంట్ అవుతారు. దాన్నే డీహైడ్రేషన్ అంటాం.

how to deal with fainting home remedies telugu

how to deal with fainting home remedies telugu

అయితే.. ఫేంట్ అవడానికి ముందు.. శరీరంలో కొన్ని లక్షణాలు కలుగుతాయి. శరీరం కొన్ని సిగ్నల్స్ ను పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ ను బట్టి మనిషి షాక్ కు గురయ్యే అవకాశం ఉందని గ్రహించాలి. ఆ సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే.. కళ్లు తిరిగి కింద పడిపోయిన వ్యక్తిని మళ్లీ యథా స్థానానికి తీసుకురావచ్చు.

how to deal with fainting home remedies telugu

how to deal with fainting home remedies telugu

Fainting : షాక్ రావడానికి ముందు కలిగే లక్షణాలు

బయటికి వెళ్లినప్పుడు కానీ.. ఇంట్లో ఉన్నప్పుడు కానీ.. నడుస్తున్నప్పుడు కానీ.. ఒకేసారి నీరసం వచ్చేస్తుంది. ఆ సమయంలో నడవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. నీరసం వస్తుంది. దీంతో వెంటనే స్పృహ తప్పి పడిపోతారు. ఒక్కసారిగా రక్తపోటు పడిపోవడం, ఒళ్లు చల్లగా మారడం జరుగుతుంది. ఎక్కువగా దాహం వేయడం.. ఎన్ని నీళ్లు తాగినా కూడా ఇంకా దాహం వేయడం, డీహైడ్రేషన్ కు గురి కావడం జరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే.. షాక్ కు గురయ్యే ప్రమాదం ఉన్నట్టు తెలుసుకోవాలి.

how to deal with fainting home remedies telugu

how to deal with fainting home remedies telugu

Fainting : షాక్ కు గురయితే ఏం చేయాలి?

ఒకవేళ ఎవరైనా కళ్లు తిరిగి స్పృహ తప్పి పడిపోయినా.. షాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసినా.. ఆ వ్యక్తిని పడుకోబెట్టి.. కాళ్లను ఎత్తుగా ఉండేలా పడుకోబెట్టాలి. బాగా గాలి ఆడేలా చేయాలి. శ్వాసను మంచిగా పీల్చుకునేలా అవకాశం ఇవ్వాలి. ఆ వ్యక్తి స్పృహలో ఉంటే మాత్రం కాసిన్ని గోరు వెచ్చని నీళ్లు ఇవ్వొచ్చు. స్పృహలో లేకపోతే మాత్రం కాసేపు పడుకోబెట్టి.. ముఖం మీద కాసిన్ని నీళ్లు కొడితే ఆ వ్యక్తి లేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తిని వెంటనే సమీపంలోని డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. ఆ వ్యక్తి కింద పడితే… ఏవైనా గాయాలు అయ్యాయో చూసి.. వెంటనే ప్రథమ చికిత్స చేయాలి.

ఇది కూడా చ‌ద‌వండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎక్కిళ్లు వేధిస్తున్నాయా? వాటిని చిటికెలో ఇలా తగ్గించే చిట్కాలు ఇవే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> జుట్టు తీగ వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> వామును ఇలా తీసుకున్నారంటే.. ఒక్క నెలలోనే 20 కేజీలు తగ్గుతారు..!

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది