Mosquitoes : దోమలకు ఈ వాసన అస్సలు పడదు.. అందుకే మీరు ఈ పని చేయండి…!
Mosquitoes : దోమలు.. మనిషి జీవితంలో ఎక్కువగా బాధపడేది వీటివల్లనే. రాత్రిళ్లు నిద్ర పోకుండా.. ఇవి చేసే టార్చర్ ప్రతి ఒక్కరికి అనుభవమే. అందుకే.. దోమలు అంటేనే మనిషికి చెడ్డ చిరాకు. వాటిని చంపేందుకు ఆల్ ఔట్, గుడ్ నైట్, కాయిల్స్, అగరబత్తీలు.. ఇలా పలురకాల దోమల మందులను వాడి వాటి నుంచి మనల్ని మనం రక్షించుకుంటాం. కానీ.. దోమలకు మనుషులన్నా.. వాళ్ల రక్తం అన్నా చాలా ఇష్టం. మన రక్తాన్ని పీల్చి మరీ తాగేసి వాటి కడుపు నింపుకుంటాయి. అదనంగా.. మనకు మలేరియా, టైఫాయిడ్ లాంటి రోగాలను బోనస్ గా అందిస్తాయి. అందుకే ఏ సీజన్ అయినా సరే.. దోమలకు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిందే. దోమలను ఇంటి గడప కూడా తొక్కనీయకూడదు.దోమలను మన దగ్గరికి కూడా రానీయకూడదు అంటే.. మనం చేయాల్సిన పనులు ఏంటో తెలుసా? వాటికి నచ్చని పనిని మనం చేయడం. అంటే దోమలకు నచ్చని వాసనలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు వెల్లుల్లి వాసన అంటే దోమలకు అస్సలు పడదు. అప్పుడు ఏం చేయాలంటే.. వెల్లుల్లి నుంచి రసాన్ని తీసి.. దాన్ని నీటిలో కలిపి దాన్ని స్ప్రేలాగా ఇల్లంతా చల్లుకోవాలి. అప్పుడు దోమలు ఇంట్లోకి రమ్మన్నా రావు. అలాగే.. వెల్లుల్లి రసాన్ని శరీరానికి పూసుకున్నా.. మీ ఒంటి మీద చేయి వేయడానికి కూడా దోమలు దడుసుకుంటాయి.
Mosquitoes : తులసి, పూదీన ఆకులను ఎప్పుడూ దగ్గర పెట్టుకోండి
ఇక.. దోమలకు తులసి ఆకుల వాసన అంటే అస్సలు పడదు. నాలుగు తులసి ఆకులను దగ్గర పెట్టుకున్నా.. దోమలు చచ్చినా మన దగ్గరికి రావు. పూదీన ఆకుల వాసన కూడా వాటికి నచ్చదు. ఆకులు లేకున్నా.. తులసి ఆకుల నూనె, పూదీన ఆకుల నూనె.. మార్కెట్ లో దొరుకుతాయి. వాటిని తెచ్చుకొని శరీరానికి పూసుకుంటే దోమలు దగ్గరికి కూడా రావు.అలాగే.. వేపాకులంటేనే దోమలకు అస్సలు పడదు. వేపాకులను ఇంట్లో ఉంచినా.. వేపాకులతో పొగ వేసినా.. దోమలు ఇంట్లో నుంచి పరార్ కావాల్సిందే. మార్కెట్ లో దొరికే వేప నూనెను శరీరానికి రాసుకుంటే.. దోమలు మిమ్మల్ని కుట్టమన్నా కుట్టవు.
Mosquitoes : ఇవి మీ దగ్గర ఉంటే.. దోమలు మీ దగ్గరికే వెతుక్కుంటూ వస్తాయి
పర్ ఫ్యూమ్స్, స్ప్రేలు ఎక్కువగా వాడేవాళ్లను దోమలు ఎక్కువగా కుడతాయట. ఎందుకంటే.. దోమలకు పర్ ఫ్యూమ్ వాసన అంటే ఇష్టం అట. అవి.. ఆ వాసనకు ఎక్కువ ఆకర్షితమవుతాయట. అలాగే.. ఓ గ్రూప్ రక్తం ఉన్నవాళ్లను కూడా దోమలు అతిగా కుడతాయట. చెమట ఎక్కువగా వచ్చినా కూడా చెమట వాసనకు ఆకర్షితమై.. దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.