huzurabad result.. మొదటి మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం..
huzurabad result.. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలల్లో బీజేపీ ముందజలో ఉంది.ఉదయం 8 గంటలకు అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఎక్కించారు. 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ ఎస్‌కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ ఓట్లు వచ్చాయి. అందులో 14 ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు.
దీంతో పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ముందజలో నిలిచారు. మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ 4,444, బీజేపీ 4,610, కాంగ్రెస్ 199 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో టీఆర్ఎస్ 4,659 ,బీజేపీ 4,851 ,కాంగ్రెస్ 339 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 192 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. మూడో రౌండ్‌లో బిజెపి 911 ఓట్లతో ముందంజ ఉన్నారు.

trs bjp
మూడు రౌండ్లు కలిపి 1269 ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్ ఉన్నారు. లెక్కిస్తారు. 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక్కో రౌండ్‌లో 14 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. కాగా వరుసగా మూడు రౌండ్లలోనూ ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.