Huzurabad bypoll : హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్.. ఎవరా అభ్యర్థి.. బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
Huzurabad bypoll : హుజూరాబాద్ ఉపఎన్నిక అసలు సమరం మొదలైది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈనెల 16న దళిత బంధు ప్రారంభ సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయనున్నారు. ఈనెల 16న హుజూరాబాద్ లో దళిత బంధు ప్రారంభ సమావేశం.. హుజూరాబాద్ లో జరగనుంది. దీనికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
Huzurabad bypoll : ఎవరీ గెల్లు శ్రీనివాస్ యాదవ్?
గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనది కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్. 1983 లో ఆయన జన్మించారు. ఆయన ఎంఏ చదివారు. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే గెల్లు శ్రీనివాస్ యాదవ్.. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవారు. డిగ్రీ చదివే రోజుల నుంచే సీఎం కేసీఆర్ అంటే ఇష్టం ఏర్పడి.. కేసీఆర్ కు అభిమానిగా మారారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు.
తెలంగాణ మలి దశ ఉద్యమ సమయం నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయనపై అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పలు కేసులు కూడా నమోదు చేసింది. 2001 నుంచి ఆయన విద్యార్థి నాయకుడిగా.. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.