Kalvakuntla Kavitha : హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోనుందా? కవిత వ్యాఖ్యలకు అర్థం ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kalvakuntla Kavitha : హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోనుందా? కవిత వ్యాఖ్యలకు అర్థం ఏంటి?

Kalvakuntla Kavitha చాలా కాలం పాటు తెలంగాణ Telangana రాజకీయాల్లో సి‌ఎం కే‌సి‌ఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత అడ్రెస్ లేని విషయం తెలిసిందే. ఎప్పుడైతే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారో అప్పటినుంచి కవిత కాస్త రాజకీయాలకు దూరమయ్యారు. అయితే కే‌సి‌ఆర్ ఫ్యామిలీలో అందరూ ఏదొక పదవిలో ఉన్నారు. దీంతో కుమార్తెని రాజకీయ నిరుద్యోగం నుంచి తప్పించడానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండకపోయినా తన ఫ్యామిలీకి మాత్రం ఏదొక ఉద్యోగం ఉండాలనే […]

 Authored By sukanya | The Telugu News | Updated on :5 October 2021,11:44 am

Kalvakuntla Kavitha చాలా కాలం పాటు తెలంగాణ Telangana రాజకీయాల్లో సి‌ఎం కే‌సి‌ఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత అడ్రెస్ లేని విషయం తెలిసిందే. ఎప్పుడైతే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారో అప్పటినుంచి కవిత కాస్త రాజకీయాలకు దూరమయ్యారు. అయితే కే‌సి‌ఆర్ ఫ్యామిలీలో అందరూ ఏదొక పదవిలో ఉన్నారు. దీంతో కుమార్తెని రాజకీయ నిరుద్యోగం నుంచి తప్పించడానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండకపోయినా తన ఫ్యామిలీకి మాత్రం ఏదొక ఉద్యోగం ఉండాలనే కోణంతో కే‌సి‌ఆర్..కవితకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి వచ్చాక కవిత నిదానంగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం మొదలుపెట్టారు. పైగా బతుకమ్మ పండగ వస్తుండటంతో కవిత మళ్ళీ తెలంగాణ పోలిటికల్ స్క్రీన్‌పై సందడి చేయడం మొదలుపెట్టారు.

Kalvakuntla Kavitha about on Huzurabad bypoll

Kalvakuntla Kavitha about on Huzurabad bypoll

Kalvakuntla Kavitha మోడీకి, కేసీఆర్ కు లింకు ..

పనిలో పనిగా హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి కూడా కామెంట్ చేశారు. హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ విజయం ఖాయమని స్ట్రాంగ్‌గానే చెప్పి, తర్వాత మంచి లాజిక్ ఒకటి చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బి‌జే‌పి గెలిస్తే సి‌ఎం కే‌సి‌ఆర్ రాజీనామా చేస్తారా? అని బండి సంజయ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై కవిత స్పందిస్తూ..పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ గెలిచారు కాబట్టి ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మమతాని ఓడించాలని బి‌జే‌పి ఛాలెంజింగ్‌కు పనిచేసి ఓడిపోయారు కాబట్టి, దానికి మోదీ బాధ్యత వహిస్తారా? అని అడిగారు. ఏదో బండి మీడియాలో కనిపించాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.

Huzurabad bypoll

Huzurabad bypoll

Kalvakuntla Kavitha హుజూరాబాద్ లో గెలుపు..?

అయితే ఇక్కడ కవిత లాజిక్ బాగానే చెప్పారుగానీ…హుజూరాబాద్‌లో బి‌జే‌పి గెలిస్తే కే‌సి‌ఆర్‌ని రాజీనామా చేయమనడం కరెక్ట్ కాదనే కోణంలో కవిత మాట్లాడారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది…అంటే కవిత లాజిక్ ప్రకారం హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ గెలవదని పరోక్షంగా చెప్పేస్తున్నట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్‌లో గెలుపు ఎవరిదనేది కవితకు బాగా క్లారిటీ ఉన్నట్లు ఉంది. ఎంతైనా కవిత చెప్పకనే చెప్పినట్లైందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

trs ministers huzurabad bypoll

trs ministers huzurabad bypoll

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది