Mutton Masala Curry : హైదరాబాది మటన్ మసాలా కర్రీ ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ లో…
Mutton Masala Curry : నాన్ వెజ్ ప్రియులు హైదరాబాది రెస్టారెంట్ లలో ఎక్కువగా బిర్యానీలు, నాన్ వెజ్ ఐటమ్స్ తింటూ ఉంటారు.. ఎందుకంటే హైదరాబాద్ స్టైల్ అంటేనే అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అందరూ చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే హైదరాబాది స్టైల్లో మనం ఎప్పుడు మటన్ మసాలా కర్రీ చేసుకుందాం… కావాల్సిన పదార్థాలు : మటన్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీడిపప్పు, గసగసాలు, జిలకర, మిరియాలు, దాల్చిన చెక్క రెండు యాలకులు, రెండు లవంగాలు, ఎండు కొబ్బరి, జాపత్రి, ఉల్లిపాయలు, పెరుగు టమాటాలు, కసూరి మేతి పచ్చిమిర్చి కొత్తిమీర మొదలైనవి..
తయారీ విధానం : ముందుగా ఒక బౌల్లో మటన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, రెండు స్పూన్ల గసగసాలు, రెండు యాలకులు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక జాపత్రి, కొంచెం జీలకర్ర, ఒక పది జీడిపప్పులు, వెండి కొబ్బరి ము నాలుగైదు వేసి ఎర్రగా వేయించుకొని తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి పేస్టులా పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై అదే కడాయిలు కొంచెం ఆయిల్ వేసి పెద్దగా ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి వాటిని దోరగా వేయించి తీసి మిక్సీ జార్లో వేసి దానిలో అరకప్పు పెరుగు కొంచెం కస్మిరీ కారం, కొంచెం ఉప్పు వేసి మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి.
తర్వాత స్టౌ పై ఒక్కడై పెట్టి నాలుగు ఐదు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దానిలో ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసి ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇక పది నిమిషాల తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అలా కలుపుకున్న మటన్ లో రెండు కప్పుల వాటన్ని పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇక అలా ఉడికిన తర్వాత దాంట్లో ఒక చిన్న కప్పు జీడిపప్పును కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి, వేసి మరొక పది నిమిషాలు పాటు ఉడకనివ్వాలి. ఇక పది నిమిషాల తర్వాత స్టవ్ ఆపుకొని కొత్తిమీర, కస్తూరి మేతి చల్లుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా హైదరాబాద్ మటన్ మసాలా కర్రీ రెడీ..