Mutton Masala Curry : హైదరాబాదీ స్టైల్ లో మటన్ మసాలా కర్రీ… ఎంతో సింపుల్గా…
Mutton Masala Curry : మటన్ మసాలా కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ లో చేస్తూ ఉంటారు. కానీ హైదరాబాది రెస్టారెంట్ లో మసాలా కర్రీ టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. అలాంటి హైదరాబాది మసాలా మటన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్ లో ఇప్పుడు మనం చేసుకుందాం… మటన్ మసాలా కర్రీ కి కావలసిన పదార్థాలు : మటన్, టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, దాల్చిన చెక్క, ధనియాలు, మిరియాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, లవంగాలు, యాలకులు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, పెరుగు, కారం, పసుపు, నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్, కసూరిమేతి మొదలైనవి..
దీని తయారీ విధానం : ముందుగా ఆఫ్ కేజీ చికెన్ తీసుకుని దానిలో ఒక స్పూన్ ఉప్పు, రెండు స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు, కొంచెం నిమ్మరసం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ పై పాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ గసగసాలు, కొన్ని మిరియాలు, ఒక దాల్చిన చెక్క, రెండు లవంగాలు, రెండు యాలుకులు,ఎండు కొబ్బరి ముక్కలు ఒక పది జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకొని పొడిచేసి చేసేటప్పుడు దానిలో కొన్ని వాటర్ వేసి మెత్తటి మిశ్రమంలో పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసి పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి లైట్ గా వేయించుకొని అవి చల్లారిన తర్వాత దాన్లో అర కప్పు పెరుగు వేసి , రెండు స్పూన్ల కారం కూడా వేసిమెత్తని మిశ్రమంలో పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని దానిలో వేసి పది పదిహేను నిమిషాల వరకు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో ముందుగా చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అలా ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత దానిలో అర లీటర్ వరకు నీటిని వేసి దానిపై మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత ఒక మటన్ పీస్ బయటికి తీసి చెక్ చేసుకుని దాన్లో కొత్తిమీర చల్లుకొని, అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసి, కొంచెం కస్తూరి మేతి కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆపుకొని దింపుకోవడమే. అంతే హైదరాబాది మటన్ మసాలా కర్రీ రెడీ.