One Rupee Idli : అక్కడ రూపాయికే ఇడ్లీ.. క్యూ కడుతున్న కస్టమర్లు..!
One Rupee Idli : సాధారణంగా టిఫిన్ తినాలంటే కనీసం 30 నుంచి 50 రూపాయలు పెట్టాల్సిందే. ఇడ్లీ, దోశ, వడ, బోండా, ఉతప్పం, ఉప్మా, పూరి.. ఇలా ఏ టిఫిన్ అయినా సరే.. కనీసం 30 రూపాయలు పెడితే కానీ రావు. అసలే.. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఈనేపథ్యంలో ఖచ్చితంగా బయట టిఫిన్ తినాలంటే పది ఇరవై రూపాయలతో అయిపోదు.
నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగినా.. ఈ హోటల్ లో మాత్రం రూపాయికే ఇడ్లీని అందిస్తారు. ఇప్పుడే కాదు.. చాలా సంవత్సరాల నుంచి వీళ్లు కేవలం రూపాయికే ఇడ్లీని అందిస్తున్నారు. అలాగే.. మైసూర్ బోండాను కూడా రూపాయికే అందిస్తున్నారు. ఇంతకీ ఈ హోటల్ ఎక్కడుంది అంటారా? పదండి..
One Rupee Idli : 16 ఏళ్ల నుంచి నడుస్తున్న కాకా హోటల్
ఆ హోటల్ పేరు కాకా హోటల్. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం దగ్గర్లోని కొత్తూరు గ్రామంలో ఉంది ఈ హోటల్. ఓ ఫ్యామిలీ ఈ హోటల్ ను 16 ఏళ్ల కింద ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నాణ్యమైన టిఫిన్ ను తక్కువ ధరకే అందిస్తూ వస్తున్నారు. అందుకే.. తెల్లవారకముందే.. ఆ హోటల్ ముందు జనాలు క్యూ కడతారు. రోజుకు కనీసం 500 నుంచి 1000 మంది దాకా వచ్చి అక్కడ టిఫిన్ చేసి వెళ్తారట. ఏది ఏమైనా.. రోజురోజుకూ ధరలు మండిపోతున్నా… కేవలం రూపాయికే ఇడ్లీ, బోండాలను అందిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ జంట. డబ్బు సంపాదించడం కాదు.. నలుగురికి నాణ్యమైన తిండి పెట్టాలన్నదే తమ ధ్యేయం అని చెప్పుకొచ్చారు ఆ దంపతులు. వీళ్లు గ్రేట్ కదా.