Cauliflower | కాలీఫ్లవర్‌ను వీళ్లు అస్సలు తినకూడదు.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక
Cauliflower |కాలీఫ్లవర్‌ను చాలా మంది ఆరోగ్యకరమైన కూరగాయగా పరిగణించి తరచూ తినే అలవాటు కలిగి ఉంటారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, మినరల్స్ వంటి అనేక పోషకాలు ఉన్నా కూడా… కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇది మంచిది కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

#image_title
ఈ ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు కాలీఫ్లవర్ తినకండి:
గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణ సమస్యలు ఉన్నవారు:
కాలీఫ్లవర్‌లో ఉండే కొన్ని కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియపై ప్రభావం చూపించి, గ్యాస్, ఉబ్బసం, అసిడిటీ వంటి సమస్యలను పెంచుతాయి.
థైరాయిడ్ రోగులు:
విపరీతంగా కాలీఫ్లవర్ తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను పరిగణించే శక్తిని కోల్పోతుంది. ఇది T3, T4 హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా హైపోథైరాయిడిజం ఉన్నవారు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి.
కిడ్నీ రాళ్లు లేదా గాల్ బ్లాడర్ రోగులు:
కాలీఫ్లవర్‌లో ఉన్న క్యాల్షియం, ఆక్సలేట్‌ల వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. గాల్ బ్లాడర్ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా దీనిని తినకూడదు.
బ్లడ్ క్లాటింగ్ సమస్యలు ఉన్నవారు:
ఈ కూరగాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని చిక్కగా చేసి, రక్త గడ్డకట్టే సమస్యను మరింత పెంచే ప్రమాదం ఉంది.
గర్భవతులు:
గర్భధారణ సమయంలో కాలీఫ్లవర్ తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు అధికంగా తలెత్తవచ్చు. కనుక డాక్టర్ సలహా లేకుండా దీనిని తినడం మానుకోవడం మంచిది.