Pongal Special : సంక్రాంతికి ముగ్గులు వేయడం వెనుకున్న కారణాలివే.. ఏ సందర్భంలో ఏ ముగ్గులు వేయాలంటే..?
Pongal Special : సంక్రాంతి పర్వదినం వచ్చిందంటే చాలు..ప్రతీ ఒక్కరు ఆనంద పడిపోతుంటారు. మగువలు వేసే ముగ్గులు చూడాలని, హరిదాసుల కీర్తనలు వినాలని, అలా చక్కగా సొంతూళ్లకు వెళ్లి హ్యాపీగా గడిపేయాలని అనుకుంటారు. అయితే, మారుతున్న జీవన శైలి, పరిస్థితుల నేపథ్యంలో కొందరు మన సంప్రదాయాలను మరిచిపోతున్నారు. కానీ, సంప్రదాయాలకు విలువనిచ్చేవారు అయితే చాలా మందే ఉన్నారు. కాగా, ఇంటి ముందర ముగ్గులు వేయడం వెనుకున్న కారణలేంటి.? ఏ సందర్భంలో ఎటువంటి ముగ్గులు వేయాలనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజానీకం సంక్రాంతికే కాదు..
ఇంకా వేరే ఏ ఇతర శుభాకార్యానికి అయినా ఇంటి ముందర ముగ్గులు వేస్తుంటారు. ఇంటి ముందర పేడతో కల్లాపి జల్లి, సున్నంపిండి, బియ్యం పిండి కలిపి ముగ్గులు వేస్తుంటారు. అలా ముగ్గు వేయడం అనేది సంప్రదాయంగా వస్తోంది. ఇకపోతే ఈ ముగ్గులను మగువలే కాదు పురుషులు కూడా ఇష్టపడుతుంటారు. ముగ్గు వేయడం వెనుకున్న కారణాలేంటంటే.. ముగ్గుల ద్వారా ఇంటి లోపలికి సాదర ఆహ్వనం పలుకతున్నట్లు అర్థం.ముగ్గులను వాకిలిలో వేయడం ద్వారా కొన్ని దోషాలు వాటంతట అవే తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు. పూర్వీకుల నుంచి ఇలా మనకు ముగ్గు వేసే సంప్రదాయం వచ్చిందట.ముగ్గు ద్వారా భూమిని అలంకరించడం జరుగుతుంది. ముగ్గులు రకరకాలుగా ఉంటాయి.
శుభాకార్యాల సందర్భంగా ఇంకా మంచి ముగ్గులు వేస్తుండటం సంప్రదాయంగా వస్తోంది. ఇంటిలోనికి దుష్ట శక్తులు రాకుండా ముగ్గులు అడ్డుకుంటాయని నమ్మకం. చాలా మంది రకరకాల ముగ్గులు వేస్తుండటం మనం చూడొచ్చు. యజ్ఞగుండం, దైవ కార్యంలో నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయడం ద్వారా ఆ ఇంటిలోని సానుకూల సంకేతాలు, శక్తి ప్రవహిస్తుందని పెద్దలు వివరిస్తున్నారు. ఇకపోతే ఇంటి ముందర ముగ్గులు వేయలేనట్లయితే అది అశుభానికి సంకేతంగా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా సంప్రదాయం ప్రకారం ముగ్గులకు అత్యంత ప్రాధాన్యత అయితే ఉంది.