YS Jagan : ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా.. సీఎంల పనితీరు సర్వేలో వైఎస్ జ‌గ‌న్‌కు భారీ షాక్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా.. సీఎంల పనితీరు సర్వేలో వైఎస్ జ‌గ‌న్‌కు భారీ షాక్?

YS Jagan ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి ఎన్నో అంచనాల మధ్య, 27 నెలల కిందట అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు.. తొలి రెండేళ్లు ఎదురు లేదన్నట్లే సాగిపోయింది. ఆరంభం నుంచి అనాలోచిత నిర్ణయాల కారణంగా విమర్శలు, వివాదాలు, కోర్టు మొట్టికాయలు కామన్‌గా ఉన్నా ప్రజాదరణ విషయంలో వైఎస్ జ‌గ‌న్‌కు తిరుగులేదన్నట్లే సాగింది. పాలన గురించి ప్రతిపక్షాలు, విమర్శకులు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. సంక్షేమ కార్యక్రమాలను పట్టుబట్టి అమలు చేయడం ద్వారా […]

 Authored By sukanya | The Telugu News | Updated on :19 August 2021,1:20 pm

YS Jagan ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి ఎన్నో అంచనాల మధ్య, 27 నెలల కిందట అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు.. తొలి రెండేళ్లు ఎదురు లేదన్నట్లే సాగిపోయింది. ఆరంభం నుంచి అనాలోచిత నిర్ణయాల కారణంగా విమర్శలు, వివాదాలు, కోర్టు మొట్టికాయలు కామన్‌గా ఉన్నా ప్రజాదరణ విషయంలో వైఎస్ జ‌గ‌న్‌కు తిరుగులేదన్నట్లే సాగింది. పాలన గురించి ప్రతిపక్షాలు, విమర్శకులు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. సంక్షేమ కార్యక్రమాలను పట్టుబట్టి అమలు చేయడం ద్వారా సామాన్య జనంలో జగన్ పాపులారిటీకి ఢోకా లేనట్లే కనిపించింది.

కానీ గత కొన్ని నెలల్లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నట్లే కనిపిస్తోంది. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని గాలికొదిలేయడం, పరిపాలన మీద పూర్తిగా పట్టు కోల్పోవడం, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే మార్గాలన్నింటినీ మూసుకుపోతుండడంతో వైఎస్ జ‌గ‌న్‌ సర్కారు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయింది. ఏపీ సర్కారు ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా తయారై ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా జీతాలు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి తలెత్తడం, ఏపీలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడంతో జనాల్లో జగన్ పాపులారిటీ ఒక్కసారిగా పడిపోయిందని స్పష్టమవుతోంది.

ys jagan

ys jagan


టాప్ టెన్ లో చోటు దక్కని వైఎస్ జ‌గ‌న్‌ Ys Jaga

ఏటా మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరును సమీక్షించే ఇండియా టుడే ..ఈ ఏడాది కూడా తన సర్వే చేపట్టి ఫలితాలు వెల్లడించింది. ఇందులో జగన్ టాప్-10లో నిలవలేకపోయారు. ఆయనకు 19 శాతం కంటే తక్కువ ఓటింగ్ శాతం వచ్చింది. ఇండియా టుడే సర్వే చేస్తే ఎవరికి గొప్ప అని జగన్ అభిమానులు తీసి పడేయడానికి కూడా లేదు. ఎందుకంటే గతేడాది జగన్‌ను ఇండియాలోనే ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఒకరిగా పేర్కొంది. టాప్-3లో చోటిచ్చింది. అప్పుడు జగన్ అభిమానులు దీన్నో పెద్ద సర్టిఫికెట్ లా చూపించుకున్నారు. అలాంటిది ఇప్పుడు జగన్ అదే జాబితాలో టాప్-10లో లేరు.

ఈ జాబితాలో 42 శాతం ఓటింగ్‌తో తమిళనాడు సీఎం స్టాలిన్ అగ్రస్థానం సాధించారు. ఆయనకు 42 శాతం మద్దతు లభిస్తే.. జగన్ 19 శాతం కంటే తక్కువ ఓటింగ్‌తో టాప్-10 బయటికి వెళ్లిపోయారు. కరోనా నేపథ్యంలో పీఎం దగ్గర్నుంచి సీఎంల వరకు అంరదూ ఎంతో కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారే కానీ.. వైఎస్ జ‌గ‌న్‌ పాపులారిటీ మాత్రం మరీ పడిపోయిందని స్పష్టమవుతోంది. సంబంధిత సర్వే రిపోర్ట్‌లను జగన్ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆయన ఇమేజ్‌ను బాగానే డ్యామేజ్ చేస్తున్నారు.


వచ్చే ఎన్నికల్లో ప్రభావం.. Ys jagan

Ysrcp

Ysrcp

రెండేళ్ల‌లోనే వైఎస్ జ‌గ‌న్‌ సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేశార‌నే విష‌యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల‌లో ఏపీకి ఒక్క‌టంటే ఒక్క కొత్త ప‌రిశ్ర‌మ రాక‌పోగా.. ఉన్న కంపెనీలే రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేస్తున్న వైనాన్ని ప్ర‌జ‌లు క‌నిపెడుతూనే ఉన్నారు. కులాల ముద్ర వేసి.. ప్ర‌జ‌ల‌ను విభ‌జించి పాలించ‌డం.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అక్ర‌మ కేసులు, అరెస్టులతో వేధించ‌డాన్ని ప్ర‌జ‌లు కనిపెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. మ‌ద్య‌పానం నిషేధమ‌ని హామీ ఇచ్చి.. అడ్డ‌గోలు బ్రాండ్లు తీసుకొచ్చి.. ధ‌ర‌లు పెంచి అడ్డంగా దోచుకోవ‌డం.. ఇసుక నుంచి ఖ‌నిజాల వ‌ర‌కూ స‌హ‌జ వ‌న‌రుల‌న్నిటినీ త‌వ్వేసుకోవ‌డం.. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిని మూడు ముక్క‌లు చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో ఆటాడుకోవ‌డాన్ని ప్ర‌జ‌లు ఏమాత్రం ఆమోదించ‌డం లేద‌ని సర్వేలో తేలిందని విపక్షాలు రచ్చ చేస్తున్నాయి. అందుకే ప్ర‌జ‌ల్లో సీఎం జ‌గ‌న్ గ్రాఫ్ వేగంగా, దారుణంగా ప‌డిపోయింద‌ని అంటున్నారు. అయితే ఈ వ్యతిరేకత ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ఉంటుందోనన్నదే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది