Post Office Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… భారీ వేతనంతో పోస్టాఫీస్ ఉద్యోగాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Post Office Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… భారీ వేతనంతో పోస్టాఫీస్ ఉద్యోగాలు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 October 2022,6:00 pm

Post Office Jobs : కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రూప్ సి పోస్టుల భర్తీకి ఇండియన్ పోస్ట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. స్కిల్డ్ ఆర్టిసన్ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఐదు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 19 2022 చివరి తేదీ కాంపిటేటివ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్ లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇండియా పోస్ట్ అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి. అంటే అధికారిక వెబ్ సైట్ లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి పూర్తిచేసి నోటిఫికేషన్ లో వెల్లడించిన అడ్రస్ కు పోస్టులో పంపాలి.

ఒకటి కన్నా ఎక్కువ పోస్టుకు అప్లై చేస్తే దరఖాస్తు ఫామ్ రిజెక్ట్ చేస్తారు. ఈ జాబ్ నోటిఫికేషన్ లో మొత్తంగా ఐదు ఖాళీలు ఉండగా అందులో ఎంవీ మెకానిక్-2, ఎంవీ ఎలక్ట్రీషియన్-1, పెయింటర్-1, టైర్ మ్యాన్-1 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 8వ తరగతి పాస్ కావాలి. టెక్నికల్ ఇన్ స్టీట్యూషన్ నుంచి సంబంధిత ట్రేడ్ లో సర్టిఫికెట్ పొంది ఉండాలి. ఎంవీ మెకానిక్ పోస్టుకు అప్లై చేసేవారికి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అభ్యర్థుల వయసు 2021 జులై 1 నాటికి 18 ఏళ్లలోపు ఉండాలి. గరిష్ట వయసు 30 ఏళ్లు ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.

Indian Post Office released jobs notifications

Indian Post Office released jobs notifications

రిక్రూట్మెంట్ సెక్షన్లో skilled Artisans నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ లో దరఖాస్తు ఫామ్ ఉంటుంది. ప్రింట్ తీసుకొని ఫామ్ పూర్తిచేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. నోటిఫికేషన్ లో ఉన్న అడ్రస్ కు చివరి తేదీలోగా చేరేలా అప్లికేషన్ ఫామ్ ను పంపాలి. అప్లికేషన్ ఫామ్ ను రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ లో పంపాలి. దరఖాస్తులు పంపించాల్సిన అడ్రస్: The Senior Manager, Mail Motor Service No.37, Greams Road, Chennai-600006. ఇండియా పోస్ట్ ఉద్యోగాలకు కాంపిటేటివ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయనుంది. ఎంపికైన వారికి ఏడో పే కమిషన్ లోని లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. బేసిక్ రూ.19900 వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది