Apple : ఆపిల్ కంపెనీ గురించి నమ్మలేని నిజాలు..! ఎంత టర్నోవర్ జరుగుతుందో తెలుసా.!? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Apple : ఆపిల్ కంపెనీ గురించి నమ్మలేని నిజాలు..! ఎంత టర్నోవర్ జరుగుతుందో తెలుసా.!?

 Authored By aruna | The Telugu News | Updated on :26 July 2022,1:30 pm

సాధారణమైన ముగ్గురు స్నేహితులు ఒక చిన్న గ్యారేజ్ నుంచి స్టార్ట్ చేసిన ఓ కంపెనీ.. మధ్యలో పూర్తి నష్టాలతో దివాలా తీయాల్సిన కంపెనీ.. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక రాబడిన వసూలు చేస్తున్న సంస్థలలో ఒకటిగా నిలిచిన తీరు.. ఏదో ఒకటి సాధించాలనుకునే యువత నుండి చిన్నగా ప్రారంభమైన స్టార్ట్ అప్ ల వరకు.. అందరికీ ఇన్స్పిరేషన్ ఈ కంపెనీ.. స్టీవ్ జాబ్స్ ఎప్పుడు ఒక మాట చెబుతారు తనకి డబ్బు సంపాదించడమో.. ధనవంతుడిగా అవ్వడమో ముఖ్యం కాదని అద్భుతమైన ఒక గొప్ప పనిని చేయటమే తనకి ముఖ్యమని అంటారు.. అదే ప్యాషన్ తో ఆయన పని చేశారు.. ఇప్పుడు ఆపిల్ కంపెనీ కూడా పనిచేస్తుంది.. అందుకే ప్రపంచంలో మరి ఏ ఇతర కంపెనీ పొందలేని అభిమానాన్ని, ఆకర్షణను పొందింది ఆపిల్ కంపెనీ..! ఈ కంపెనీ ఎలా స్టార్ అయ్యింది.!? ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి..

Apple : స్టీవ్ జాబ్స్

1976 లో ఏప్రిల్ 1 న స్టీవ్ జాబ్స్, స్టీవ్ ఓజినియక్, రోనాల్డ్ వేమ్ అనే ముగ్గురు కలిసి యాపిల్ computer’s అనే కంపెనీని స్టార్ట్ చేశారు.. యాపిల్ లోగో ఇప్పుడు ఆపిల్ ఆకారంలో ఉంది కానీ.. ఒకప్పుడు మాత్రం న్యూటన్ చెట్టు కింద కూర్చున్న లోగో ఉండేది.. ఈ లోగో ను డిజైన్ చేసింది రోనాల్డ్ వేమ్.. కానీ కంపెనీ స్టార్ట్ చేసిన పది రోజులకే రోనాల్డ్ తన 10% వాటాను వెనక్కి తీసేసుకున్నాడు.. అదే ఇప్పుడు కనక ఉంచుకొని ఉంటే అత్యధిక సంపన్నులలో తను కూడా ఒకటిగా నిలిచేవాడు..

Interesting facts about apple company

Interesting facts about apple company

స్టీవ్ ఓజినియక్ కి కంప్యూటర్ పై మంచి పట్టు ఉంది తనే ఫస్ట్ కంప్యూటర్ను డిజైన్ చేశాడు.. అయితే కేవలం స్క్రీన్ మాత్రమే ఉండేది.. ఈ కంప్యూటర్ కి మార్కెట్లో డిమాండ్ ఉందని స్టీవ్ జాబ్స్ వీటిని ప్రమోట్ చేశారు.. ఆ తరువాత స్టీవ్ జాబ్స్ తయారు చేసిన apple _2 కంప్యూటర్ బాగా క్లిక్ అయింది ఎంతలా అంటే స్పీడ్ జాబ్స్ ఏజ్ 23 వచ్చేసరికి ఒక మిలియన్ డాలర్స్ 24 వచ్చేసరికి 10 మిలియన్ డాలర్స్ 25 ఏళ్ళు వచ్చేసరికి 100 మిలియన్ డాలర్స్ కు చేరింది ఆ రేంజ్ లో ఆపిల్ కంపెనీకి లాభాలు వచ్చాయి.. కంపెనీ పీక్స్ లో ఉంటున్న సమయంలో 1985 లో బోర్డు సభ్యులందరూ నిర్ణయం తీసుకొని తనని కంపెనీ నుంచి బయటకు పంపించేశారు.. ఎప్పుడైతే స్టీల్ జాబ్స్ బయటకు వెళ్ళిపోయాడు.. అప్పటినుంచి మళ్ళీ కంపెనీ పతనం అవ్వడం ప్రారంభమైంది..

యాపిల్ కంపెనీ లాంటి కంప్యూటర్స్ ను ఐబిఎం తయారు చేయడంతో ఆపిల్ షేర్స్ పడిపోయాయి.. దాంతో మార్కెట్లోకి ఆపిల్ రకరకాల ప్రొడక్ట్స్ ను తీసుకొచ్చింది కానీ ఫలితం లేదు ఇక స్టీల్ జాబ్స్ పనిచేస్తున్న ఒక కంపెనీని కొని మళ్లీ ఆపిల్ సంస్థకు సీఈఓ ను చేశారు.. స్టీవ్ జాబ్స్ ఆపిల్ కంపెనీ లోకి వచ్చేసరికి కేవలం మూడు నెలల లోనే ఈ కంపెనీ దివాలా తీసే పరిస్థితి నెలకొంది.. కానీ స్టీవ్ జాబ్స్ మళ్ళీ కంపెనీని యధా స్థానానికి తీసుకువచ్చాడు.. ఆ పీక్స్ టైంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ 150 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు.. ఇది ఆపిల్ కంపెనీకి ప్లస్ అయింది.. దాంతో లాస్ట్ లో ఉన్న కంపెనీని లాభాల బాట పట్టించాడు స్టీవ్ జాబ్స్.. దాంతో యాపిల్ సంస్థ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితికి రాకుండా చేశాడు స్టీవ్ జాబ్స్ అందుకే పర్మినెంట్ సీఈఓ అయ్యాడు.. ఆ తర్వాత స్టీల్ జాబ్స్ క్రియేట్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని మార్కెట్లో ప్రభంజనాన్ని సృష్టించాయి.. ఐప్యాడ్స్, ఐ మ్యాక్ డెస్క్ టాప్, మ్యాక్ బుక్ బ్రో అనే లాప్ టాప్ ప్రొడక్ట్స్ యాపిల్ కంపెనీ లాభాల బాట పట్టించాయి ఆ తరువాత విడుదలైన రెవల్యూషనరీ ప్రోడక్ట్ ఐఫోన్ రిలీజ్ చేశారు..

Interesting facts about apple company

Interesting facts about apple company

ఇక 2011 లో స్టీవ్ జాబ్స్ క్యాన్సర్ తో చనిపోయారు.. ఆ తరువాత టీం కుక్ ను సీఈఓ గా నియమించారు.. ఆ తరువాత ఆపిల్ నుంచి రకరకాల ప్రొడక్ట్స్ వచ్చాయి అవన్నీ బయ్యర్స్ కు ఆనందాన్నిచ్చాయి.. పైగా సర్వీస్ కూడా లభించడంతో ఈ ప్రొడక్ట్స్ కొనడానికి జనాలు ఎగబడ్డారు.. దాంతో యాపిల్ మార్కెట్ వేల్యూ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. అలా 2018లో ఆపిల్ మార్కెట్ వేల్యూ వన్ ట్రిలియన్ డాలర్స్ కు చేరుకుంది.. అంటే మన రూపాయలలో సుమారు 78 లక్షల కోట్లు… ఆ తర్వాత రెండు సంవత్సరాలకి 2020 కు 2 ట్రిలియన్ డాలర్స్ కు చేరుకుంది.. 2022 నాటికి యాపిల్ మార్కెట్ వేల్యూ మూడు ట్రిలియన్ డాలర్స్ కు చేరుకుంది.. మన రూపాయలలో చెప్పుకోవాలంటే రెండు కోట్ల 34 లక్షల కోట్లు.. ప్రపంచంలో మూడు ట్రిలియన్ డాలర్స్ కు చేరుకున్న మొదటి కంపెనీ ఇదే..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది