TRS – BJP : తెలంగాణ రాష్ట్ర సమితికి సాయం చేస్తున్న బీజేపీ.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS – BJP : తెలంగాణ రాష్ట్ర సమితికి సాయం చేస్తున్న బీజేపీ.?

 Authored By aruna | The Telugu News | Updated on :9 August 2022,10:20 pm

TRS – BJP : రాజకీయాల్లో ఈక్వేషన్స్ చిత్ర విచిత్రంగా మారుతుంటాయి. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించుతామంటోంది తెలంగాణ బీజేపీ. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఇలా జాతీయ స్థాయి నాయకులు, టీఆర్ఎస్ సర్కారుని గద్దె దించి తీరతామంటూ రాజకీయ ప్రకటనలు చేస్తుండడాన్ని చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరికొందరు తెలంగాణ బీజేపీ నేతలు చాలా చాలా అగ్రెసివ్‌గా వ్యవహరిస్తున్నారు టీఆర్ఎస్ విషయంలో. కేసీయార్‌ని జైల్లో పెట్టేస్తామంటూ బీజేపీ నేతలు ప్రకటనలు చేయడం కొత్తేమీ కాదు. ఏళ్ళ తరబడి ఈ వ్యవహారం నడుస్తూ నడుస్తూ వుంది. ఈ మధ్య అది ఇంకాస్త ముదిరి పాకాన పడింది.

చిత్రమేంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ప్రజా ప్రతినిథులెవరూ బీజేపీ వైపు వెళ్ళడంలేదు. అనూహ్యంగా ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిర్వీర్యమవుతోంది. అంటే, ఇక్కడ బీజేపీ ఫోకస్, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడంలోనే వున్నట్లు కనిపిస్తోంది. మరి, తెలంగాణ రాష్ట్ర సమితి మాటేమిటి.? బీజేపీ వ్యూహాలు గులాబీ పార్టీకి లాభమా.? నష్టమా.? తెలంగాణ రాష్ట్ర సమితి లాభపడుతోంది తెలంగాణలో బీజేపీ రాజకీయాల వల్ల. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని భావిస్తోన్న కొందరు నేతలు, అయితే బీజేపీ వైపు లేదంటే, తెలంగాణ రాష్ట్ర సమితి వైపు వెళ్ళడం మామూలే. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగు లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ వ్యతిరేకత కాస్తో కూస్తో వుంటే, బీజేపీ రాజకీయాల కారణంగా అది కాస్తా చీలిపోయే అవకాశం వుంది.

Is BJP Helping TRS In Telangana

Is BJP Helping TRS In Telangana?

మజ్లిస్ మద్దతు తెలంగాణ రాష్ట్ర సమతికే వుంటుంది గనుక, బీజేపీ రాజకీయాల వల్ల కాంగ్రెస్ నష్టపోతుందేమోగానీ, తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చే కొత్త కష్టమేమీ వుండకపోవచ్చు. అందుకేనేమో, బీజేపీ నేతల విమర్శలపై బాహాటంగా తెలంగాణ రాష్ట్ర సమితి కౌంటర్ ఎటాక్ ఇస్తున్నా, లోలోపల గులాబీ శ్రేణులు ఫుల్ ఖుషీగా వున్నాయ్. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా వచ్చే అవకాశం వుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. ఒకవేళ మునుగోడులో గులాబీ పార్టీ గెలిచినా, అది కాంగ్రెస్ సీటు గనుక.. టీఆర్ఎస్‌కి వచ్చే నష్టం ఏముంటుంది.?

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది