Abhishek Sharma : అభిషేక్ శర్మ పేపర్ వెనుక ఇంత కథ ఉందా..?
ప్రధానాంశాలు:
Abhishek Sharma : అభిషేక్ శర్మ పేపర్ వెనుక ఇంత కథ ఉందా..?
Abhishek Sharma : ఉప్పల్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. ప్లే ఆఫ్ ఆశలు బతికించుకునేందుకు తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో చరిత్రలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. ఇది గెలిచేందుకు గల భారీ లక్ష్యం కాగా, సన్‌రైజర్స్ మాత్రం ఆ కంటే ఎక్కువగా పరుగుల వర్షం కురిపించి ఈ లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి చరిత్ర సృష్టించింది.

Abhishek Sharma : అభిషేక్ శర్మ పేపర్ వెనుక ఇంత కథ ఉందా..?
Abhishek Sharma : అభిషేక్ శర్మ పేపర్ రష్యాన్ని బయటపెట్టిన హెడ్
ఈ మ్యాచ్‌లో విశేషంగా రాణించిన అభిషేక్ శర్మ కేవలం 55 బంతుల్లోనే 141 పరుగులు చేసి మ్యాచ్ విజేతగా నిలిచాడు. అతనితో కలిసి ట్రావిస్ హెడ్ 66 పరుగులతో మెరిశాడు. అభిషేక్ శర్మ తన బలమైన స్ట్రైక్ రేట్‌తో పవర్‌ప్లే నుంచే పంజాబ్ బౌలర్లపై దాడి ప్రారంభించి ఆటను ఒక్కదశలోనే వన్‌సైడెడ్ చేశాడు. 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన అతను ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు అసలైన విజ్ఞప్తి చేశాడు. “This one is for Orange Army” అని తన జేబులో ఉన్న కాగితాన్ని చూపిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఈ ఘటన అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపింది. శతకం తర్వాత అభిషేక్ చూపించిన ఆ పేపర్‌పై అందరూ ఆశ్చర్యపోయారు. అయితే మ్యాచు అనంతరం ట్రావిస్ హెడ్ చేసిన వ్యాఖ్యలు మరింత హాస్యాస్పదంగా మారాయి. అభిషేక్ శర్మ ఆ పేపర్‌ను గత ఆరు మ్యాచులుగా తనతోపాటు జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడట. ఈసారి శతకం సాధించిన సందర్భంగా ఆ పేపర్‌ను బయటకు తీసి తన ఆనందాన్ని పంచుకున్నాడు అని హెడ్ తెలిపాడు. ఈ విషయం తెలిసి అభిమానులు “ఇంత బాగా మోసం చేస్తావా?” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా, అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఫ్యాన్స్ మదిలో చెరగని గుర్తింపు తెచ్చుకున్నాడు.