Venkaiah Naidu : వెంకయ్య నాయుడు రాజకీయ భవిష్యత్ ముగిసినట్టేనా..? ఉపరాష్ట్రపతి పదవికి ఎందుకు ఒప్పుకున్నాడసలు..?
Venkaiah Naidu : తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వెంకయ్య నాయుడుకు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోని సీనియర్ నాయకులలో ఈయన ఒకరు. 2017 లో ఉపరాష్ట్రపతి రేస్ లో వెంకయ్య ఉన్నాడు అన్న వార్తలు వచ్చినప్పుడు తాను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అనుకోవడం లేదని ఉషపతిగా సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించాడు. ఉషా ఆయన భార్య పేరు. హిందీ,ఇంగ్లీష్ భాషల్లో వెంకయ్య కు మంచి పట్టు ఉంది. ఆయనకు ఉపరాష్ట్రపతి అవ్వాలన్నది ఇష్టం ఉండేది కాదు. ఇదే విషయాన్ని తాను రాసిన పుస్తకం లిజనింగ్, లెర్నింగ్, లీడింగ్ ఆవిష్కరణ సమయంలో అంగీకరించారు.
Venkaiah Naidu : వెంకయ్య నాయుడు రాజకీయ జీవితం..
రెండోసారి బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు తను క్యాబినెట్ లో ఉండబోనని వెంకయ్య మోడీ తో చెప్పాడు. వెంకయ్యనాయుడు సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని దగ్గర నుండి చూసిన వారిలో యలమంచిలి శివాజీ ఒకరు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో వెంకయ్య గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. వెంకయ్యనాయుడుకు కేంద్ర క్యాబినెట్ లో ఉండడం ఇష్టమని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఆయన ఇష్టం లేదని తన దగ్గర ఈ అంశం గురించి అయన చర్చించగా ఏమీ ఆలోచించకుండా ఎన్డీఏ ప్రతిపాదనకు ఓకే చెప్పమని తాను సలహా ఇచ్చినట్టు శివాజీ చెప్పుకొచ్చారు. ఒకసారి ఉపరాష్ట్రపతి అయితే తర్వాత రాష్ట్రపతి కావచ్చు అన్న భావన అందరిలో ఉండేది. సర్వేపల్లి రాధాకృష్ణ, వివి గిరి, వెంకటరామన్, శంకర్ దయాల్ శర్మ, కె ఆర్ నారాయణ్ ఇలాంటివారిని ఉదాహరణగా చెప్పానని శివాజీ అన్నారు. తనతోపాటు వెంకయ్యకు మరికొందరు స్నేహితులు కూడా ఇదే సలహా ఇవ్వడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఆయన ఓకే చెప్పాడట.
తాజాగా వెంకయ్యనాయుడును తిరిగి ఉపరాష్ట్రపతిగా కూడా ఎన్నుకోలేదు. దీంతో రాష్ట్రపతి అవకాశం చేజారిపోయినట్టు అయింది. తనకు రాష్ట్రపతి కావాలని వెంకయ్యనాయుడు అనలేదు, ఇస్తామని ఎన్డీయే ప్రభుత్వం కూడా చెప్పలేదు దీంతో రాష్ట్రపతి ఆశలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 1949 జూలై 1న వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లాలో జన్మించాడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్యనాయుడు నెల్లూరులోనే వీఆర్ హై స్కూల్లో చదువుకున్నాడు. లా, పొలిటికల్ సైన్స్ చదువుకొని విద్యార్థి దశలోనే రాజకీయాల వైపు మొగ్గు చూపాడు. 1971 నుండి 1997 వరకు జాతీయ రాజకీయ రంగాల్లో వివిధ పదవులు చేపట్టారు వెంకయ్యనాయుడు. 1993 నుండి 2017 ఉప రాష్ట్రపతి అయ్యే వరకు నిరాటంకంగా రాజకీయాల్లో ఉన్నాడు. రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యపై చాలా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా వెంకయ్యనాయుడుపై చంద్రబాబు ప్రభావం బాగా ఉందని టాక్.
రాష్ట్రానికి సంబంధించిన చాలా విషయాలు చంద్రబాబు చెబితేనే వెంకయ్య నాయుడు కేంద్ర పెద్దలతో మాట్లాడేవాడు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో ఇంగ్లీష్ కు ప్రత్యామ్నాయంగా హిందీని ఉపయోగించాలని అమిత్ షా అన్నాడు. అయితే వెంకయ్య మాత్రం ఒకరు మాట్లాడే భాష ఇంకొకరు మాట్లాడటంపై బలవంతం చేయొద్దని, వారికీ స్వేచ్ఛ ఇవ్వాలని అన్నాడు. దీంతో అమిత్ షా వెంకయ్య పై అభిప్రాయాన్ని మార్చుకుని రాష్ట్రపతి రెండోసారి కాకుండా చేశాడనేది టాక్. ఇప్పుడు అన్ని అవకాశాలు చేజార్చుకున్న వెంకయ్యనాయుడు ఏమి చేస్తాడు అన్న విషయం ప్రశ్నార్థకంగా మిగిలింది. ఆయన స్నేహితులు మాత్రం వెంకయ్యనాయుడు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పని చేస్తానని చెబుతున్నారు. ఇప్పటికే స్వర్ణ భారతి ట్రస్ట్ ఆయన కుమార్తె నడిపిస్తుంది. స్నేహితులతో ప్రారంభమైన ఈ స్వర్ణ భారతి ట్రస్ట్ ను ఇప్పుడు వెంకయ్య నాయుడే స్వయంగా నిర్వహిస్తానని సమాచారం.