Venkaiah Naidu : ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి… అందుకే వెన్నుపోటుకు గురయ్యారు.. వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు వైరల్
Venkaiah Naidu : మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నేత సీనియర్ ఎన్టీఆర్ అని వెంకయ్య నాయుడు చెప్పకొచ్చారు. తెలుగు రాజకీయాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం ఎన్టీఆర్ అని వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. ముఖ్యంగా బలహీన వర్గాలకు రాజకీయాల్లో ప్రధాన స్థానం కల్పించారు.
అయితే.. ఎన్టీఆర్ కు కుట్రలు, కుతంత్రాలు తెలియవు. ఆయన కల్మషం లేని వ్యక్తి. అందరినీ నమ్మేవారు. అదే ఆయనకు మైనస్ పాయింట్ అయింది. అందరినీ నమ్మడం వల్ల.. ఆయన వెనుక జరిగే కుట్రలను గుర్తించలేకపోయారు. అందుకే ఆయన వెన్నుపోటుకు గురయ్యారు.. అంటూ వెంకయ్య నాయుడు వైస్రాయ్ హోటల్ ఘటనను గుర్తు చేశారు. అయితే.. కొందరు నాయకులు ఇష్టం ఉన్నట్టుగా పార్టీలు మార్చే విధానం కరెక్ట్ కాదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. నచ్చిన వారు నచ్చిన పార్టీలో చేరడంలో తప్పు లేదు కానీ..
Venkaiah Naidu : నచ్చిన వారు నచ్చిన పార్టీలో చేరడంలో తప్పులేదు
పదవుల్లో ఉండి కూడా ఆ పదవులను వదిలేయకుండా వేరే పార్టీలో చేరడం మాత్రం కరెక్ట్ కాదన్నారు. అధికార పార్టీలలో చేరి మంత్రి పదవులు పొందడం కరెక్ట్ కాదన్నారు. అంటే ఇన్ డైరెక్ట్ గా వెంకయ్య నాయుడు చంద్రబాబు, కేసీఆర్ కు చురకలు వేశారు. అయితే.. తాను కేవలం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడటం లేదని.. దేశం మొత్తం గురించి, అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీల గురించి చెబుతున్నానని చెప్పుకొచ్చారు. ప్రజల తీర్పును ఖచ్చితంగా గౌరవించాలన్నారు. అలాగే.. చట్ట సభల్లో అర్థవంతమైన చర్చ జరగాలని.. తెలుగు భాష గొప్పదనం గురించి కూడా వెంకయ్య నాయుడు తెలిపారు.