Jobs : 10th అర్హతతో బొగ్గు గనుల్లో ఉద్యోగాలు… ఏలా అప్లై చేయాలంటే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jobs : 10th అర్హతతో బొగ్గు గనుల్లో ఉద్యోగాలు… ఏలా అప్లై చేయాలంటే…!!

నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా భారత ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మరియు నవరత్న హోదా కలిగి యున్న నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల అప్లికేషన్ చివరి తేదీ ఇటీవల పొడిగించారు. ద్వారా ఇంతకుముందు అప్లై చేయాలి అనుకున్నవారు ఇప్పుడు తిరిగి అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 May 2024,8:00 pm

నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా భారత ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మరియు నవరత్న హోదా కలిగి యున్న నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల అప్లికేషన్ చివరి తేదీ ఇటీవల పొడిగించారు. ద్వారా ఇంతకుముందు అప్లై చేయాలి అనుకున్నవారు ఇప్పుడు తిరిగి అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ NCL నుండి విడుదల కావడం జరిగింది.

ఖాళీలు…

ఇక ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఖాళీగా ఉన్నటువంటి 239 ఇండస్ట్రియల్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత…

ఇక ఈ ఇండస్ట్రియల్ ట్రైనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనీసం 10th ,ITI , DIPLOMA పూర్తి చేసి ఉండాలి.

వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే OBC అభ్యర్థులకు 40 సంవత్సరాలు , SC,ST అభ్యర్థులకు 42 సంవత్సరాలు , UR/ EWS అభ్యర్థులకు 37 సంవత్సరాలు వయస్సు ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులవుతారు

అప్లై చేయు విధానం..

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ముందుగా సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదుచేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలను కేవలం ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేయగలరు.

ఎంపిక విధానం…

ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి ముందుగా రాత పరీక్ష నిర్వహించి దానిలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది