Jr Ntr : ఇది అరాచక పాలన.. వైసీపీపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వీడియో !
Jr Ntr : నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన నా మనసును తీవ్రంగా కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. మనం మాట్లాడేది మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారంణ, ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో దూషణలు సరికాదని జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మనం ఎప్పుడు ప్రజల సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నామో.. మహిళలను గౌరవించడం మన సంస్కృతి. ఇది మన రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయం అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. మరీ ముఖ్యంగా మహిళల గురించి పురుషపదజాలంతో మాట్లాడుతున్నామో.. అది అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందని ఆయన పేర్కొన్నారు.

Jr Ntr Strong counter on Ysrcp
నేను ఒక కుటుంబసభ్యుడిగా మాట్లాడుతలేదు. ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, భర్తగా, దేశ పౌరుడిగా మరియు ఒక తెలుగువాడిలా మాట్లాడుతున్నానని తెలిపారు. ఇలాంటి అరాచక సంస్కృతిని ఆపి, ప్రజల సమస్యలపై పోరాడాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే తరాలకు బంగారు బాట వేయాలని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఇది అలా ఉంటే.. ఈ ఘటనపై టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, లు స్పందించారు.
— Jr NTR (@tarak9999) November 20, 2021