Karthika Deepam Today Episode : దీప ఉందని తెలియక దీప కారునే లిఫ్ట్ అడిగి ఎక్కిన మోనిత.. ఇద్దరూ ఒకే కారులో సూర్యాపేటకు.. వాట్ ఏ ట్విస్ట్
Karthika Deepam Today Episode : కార్తీక దీపం సీరియల్ 1108 ఎపిసోడ్ 3 ఆగస్టు 2021 మంగళవారం రోజు ప్రసారం కానుంది. కార్తీక దీపం సీరియల్ మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. దీప.. సూర్యాపేటకు వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకొని డాక్టర్ బాబుకు నచ్చజెప్పి బయలుదేరుతుంది. మరోవైపు మోనిత కూడా కారులో సూర్యాపేట బయలు దేరుతుంది. డ్రైవ్ చేస్తూనే మోనిత కలలు కంటుంది. అంజి గాడు దొరికితే ఇక నా పెళ్లి అయిపోయినట్టే అని అనుకుంటుంది. ఎలాగైనా అంజిని పట్టుకొని.. వాడు మాట వినకపోతే గన్ తో కాల్చి చంపడానికైనా మోనిత రెడీ అయిపోయింది.

Karthika Deepam 3 august 2021 episode 1108 highlights
కట్ చేస్తే.. దీప కూడా కారులో సూర్యాపేట బయలుదేరుతుంది. సూర్యాపేటలో ఎక్కడికి వెళ్లాలి.. అని డ్రైవర్ అడగగానే 8 రెస్టారెంట్ అని చెబుతుంది. కాసేపు డ్రైవర్ తో ముచ్చటిస్తుంది దీప. కాకపోతే.. దీపలో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంజి గాడిని ట్రంప్ కార్డులా రోషిణి వాడుకోవాలనుకుంటుందని.. అంజి ఎలాగైనా నా మాట వినాలని.. లేకపోతే అంజికి చావే గతి అని మోనిత కారు డ్రైవ్ చేస్తూనే తనలో తానే మాట్లాడుకుంటుంది.

Karthika Deepam 3 august 2021 episode 1108 highlights
Karthika Deepam Today Episode : మోనిత, కార్తీక్ కలిసిపోయినట్టు కలగన్న భాగ్యలక్ష్మి
దీప.. తన పిన్ని భాగ్యలక్ష్మికి ఫోన్ కు చేసి.. ఏడుస్తూ మాట్లాడుతుంది. పిన్ని అనుకున్నదే జరిగింది. డాక్టర్ బాబును మోనిత తీసుకెళ్లిపోయింది పిన్ని. డాక్టర్ బాబు.. మోనితనే పెళ్లి చేసుకుంటాడట. నా జీవితం ఇక నాశనమే పిన్ని.. అంటూ ఫోన్ చేసి చెబుతుంది. ఇంతలోనే భాగ్య ఉలిక్కిపడి లేస్తుంది. ఓహ్.. ఇదంతా కలా అని అనుకుంటుంది. వెంటనే దీపకు కాల్ చేస్తుంది.

Karthika Deepam 3 august 2021 episode 1108 highlights
దీప.. తలదిండు తీసుకెళ్తుంది కానీ.. ఫోన్ తీసుకెళ్లడం మరిచిపోతుంది. దీంతో తన ఫోన్ కు భాగ్య కాల్ చేస్తుంది. నెంబర్ చూసి డాక్టర్ బాబు షాక్ అవుతాడు. దీప అక్కడికే వెళ్లింది కదా.. ఆమె ఫోన్ నుంచి చేస్తుందేమో అని అనుకొని లిఫ్ట్ చేస్తాడు. కానీ.. తీరా చూస్తే బాబు.. దీప ఉందా? అని అనేసరికి దీప.. తన ఇంటికే వెళ్తానని చెప్పింది కదా అని మనసులో అనుకుంటాడు. ఇప్పుడు దీప లేదని చెబితే.. భాగ్య టెన్షన్ పడుతుందని.. దీప పడుకుందని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దీప.. పిన్ని దగ్గరికి వెళ్తా అని అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్లింది. కొంపదీసి మోనిత ఇంటికి వెళ్లి తనతో గొడవ పెట్టుకుంటుందేమో అని వెంటనే డాక్టర్ బాబు కూడా తన ఇంటికి బయలుదేరుతాడు.

Karthika Deepam 3 august 2021 episode 1108 highlights
తీరా మోనిత ఇంటికి వెళ్లి చూస్తే తను ఉండదు. మోనితమ్మ లేదని ప్రియమణి చెబుతుంది. దీంతో డాక్టర్ బాబు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే.. మోనిత కారు డ్రైవ్ చేస్తూనే ఇంకా ఆ అంజి గురించే టెన్షన్ పడుతుంటుంది. ఇంతలోనే మోనిత కారు ఆగిపోతుంది. దీంతో మోనితకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో డాక్టర్ బాబు కూడా కారులో బయలు దేరి దీప కోసం వెతుకుతుంటాడు.

Karthika Deepam 3 august 2021 episode 1108 highlights
తన కారు అస్సలు స్టార్ట్ కాకపోవడంతో ఎలాగైనా లిఫ్ట్ అడిగి అయినా సూర్యాపేట వెళ్లాలని నిర్ణయించుకుంటుంది మోనిత. అప్పుడే దీప వెళ్తున్న కారు రావడంతో.. దీప.. మోనితను చూస్తుంది. మోనిత కూడా కారును లిఫ్ట్ అడుగుతుంది. దీంతో కారు ఆపాలా అని డ్రైవర్ దీపను అడుగుతాడు. దీంతో ఆపు కానీ.. మనం సూర్యాపేట వెళ్తున్నామని మాత్రం చెప్పకు. విజయవాడ వెళ్తున్నామని చెప్పు.. అని అంటుంది. దీంతో మోనిత కారు ఎక్కుతుంది. వెంటనే వీరేశం అనే వ్యక్తికి ఫోన్ చేసి నేను సూర్యాపేటకు 40 నిమిషాల్లో వస్తున్నా.. మన వాళ్లకు చెప్పు అంటూ చెబుతుంది. అయితే.. మోనిత కూడా అంజి కోసమే వెళ్తోంది అని తెలుసుకొని ఏం చేయాలా అని ఆలోచిస్తుంది.

Karthika Deepam 3 august 2021 episode 1108 highlights
ఇది కూడా చదవండి ==> బుల్లితెరకు పూర్తిగా గుడ్ డై.. యాంకర్ వర్షిణి పని ఖతం!!
ఇది కూడా చదవండి ==> శేఖర్ మాస్టర్‌కు శ్రీముఖి ముద్దు.. వారి సరసాలను నిలదీసిన శ్రీదేవీ !
ఇది కూడా చదవండి ==> ఇండస్ట్రీలోని చీకటి రహస్యాలు… హీరోయిన్-డైరెక్టర్ వ్యవహారం వైరల్
ఇది కూడా చదవండి ==> ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా.. కాజల్ అగర్వాల్ ఏం చేస్తోందో చూడండి.. వీడియో