Viral News : స్కానింగ్ కోసం వెళ్లి ఊహించని రీతిలో మరణించిన చిన్నారి.. నవ్వూతూ వెళ్లి, శవమై వచ్చాడంటూ తల్లిదండ్రుల రోదన..!
Viral News : సీటీ స్కాన్ కోసం వెళ్తే ఓ చిన్నారి ప్రాణం పోయింది. అప్పటిదాకా తన కళ్ల ముందు నవ్వుతూ కనిపించిన తన గారాలపట్టి తనకు ఇక ఓ జ్ఞాపకమే అని తెలిసి ఆ మాతృమూర్తి పడిన వేదన అంతా ఇంతా కాదు. నిన్నటి దాకా ముద్దు ముద్దు మాటలతో నట్టింట నడయాడిన కన్నబిడ్డ శాశ్వత నిద్రలోకి జారుకుందని తెలిసి ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. స్కానింగ్ కు తీసుకు వచ్చిన తన పిల్లాడు.. అకస్మాత్తుగా ల్యాబ్ లోనే ప్రాణాలు విడవటంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ విషాదకర సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.ధనౌలి ప్రాంతానికి చెందిన వినోద్…
తన మూడేళ్ల కుమారుడు దివ్యాంష్ నాలుగు రోజుల క్రితం ఇంటి బిల్డింగ్ పైన ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. దీంతో వెంటనే చిన్నారిని స్థానికంగా ఉండే నామ్నిర్ ఎస్‌ఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆ తల్లిదండ్రులు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు.. అతడికి సీటీ స్కాన్ చేయించాలని సూచించారు. దీంతో వారు ఆ బాలుడిని సుభాష్ పార్క్ ప్రాంతంలో ఉన్న అగర్వాల్ సీటీ స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీటీ స్కాన్ చేయడానికి ముందు దివ్యాంష్ కు డాక్టర్లు ఓ ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తరువాత చిన్నారికి స్కాన్ చేశారు. ఇదంతా బాగానే జరిగినా.. ఆ తర్వాతే జరగరాని ఘోరం జరిగిపోయింది.అప్పటి వరకు బాగానే ఉన్న దివ్యాంష్…

kid died in a city scanning center in up news went viral News
Viral News : వైద్యం కోసం వెళ్లి ప్రాణాలు విడిచిన బాలుడు..!
స్కాన్ చేసిన అనంతరం ఎవరూ ఊహించని విధంగా ఆరోగ్యం విషమించి ప్రాణాలు విడిచాడు. ఆ పరిణామం తో షాక్ లోకి జారుకున్న తల్లిదండ్రులు.. ఆ తర్వాత ఎం జరిగిందో తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో సీటీ స్కాన్ సెంటర్ నిర్వాహకులు తప్పిదం వల్లే తమ పిల్లాడు చనిపోయాడని దివ్యాంష్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పెద్ద ఎత్తున చిన్నారి మృతదేహంతో సీటీ స్కాన్ సెంటర్ వద్దకు వెళ్లగా, అప్పటికే దానికి తాళం వేసి ఉంది. దీంతో వారంతా ఆ బాలుడి మృతదేహంతో సీటీ స్కాన్ సెంటర్ బయట ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీటీ స్కాన్ సెంటర్ నిర్వహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.