Tea : చాయ్‌లో పాలు కలపడానికి కారణం ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : చాయ్‌లో పాలు కలపడానికి కారణం ఇదే..!

 Authored By mallesh | The Telugu News | Updated on :6 January 2022,6:00 am

Tea : అసలే శీతాకాలం.. ఆపై విపరీతమైన చలి.. వేడివేడిగా ఎదైనా తాగాలని అనిపిస్తుంది. దీంతో వెంటనే అందరికీ ఒకటి గుర్తుస్తుంది. అది తాగితే గానీ కొందరు బెడ్‌పై నుంచి దిగరు. మరికొందరికైతే అది తాగకపోతే అసలు ఏమి తోచదు. ఇంతకీ అది ఏంటంటారా? అదేనండి చాయ్.అతి చౌకగా దొరుకుతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమాలో ఏకంగా చాయ్‌పై ఓ పాట కూడా ఉంది. ‘‘చాయ్ చటుక్కున తాగురా బాయ్’’ అన్న పాట అప్పట్లో చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటను చిరంజీవి స్వయంగా పాడారు. అయితే ఈ సినిమా కంటే ముందు 80 దశకంలో వచ్చిన సినిమాల్లో చాలా సందర్భాల్లో టేబుల్‌పై ఉంచిన టీలో పాలు కలుపుకుని తాగడం మనం గమనించే ఉంటాం.

అయితే ఇలా ఎందుకు చేస్తారో? ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా మన ఇళ్లలో ముందుగా టీ మరిగించి వెంటనే పాలు కలుపుతారు.బ్రిటన్‌లో మాత్రం టీ కోసం పాలు విడిగా పెడుతుంటారు. అసలు అలా చేయడానికి ఏమైన కారణం ఉందా? లేక రుచి కోసం అలా చేస్తున్నారా? ముందుగా చాయ్ ఎప్పుడు నుంచి తయారైందో తెలుసుకుందాం. టీ 18 శతాబ్దాంలో మొదటిసారి బ్రిటన్‌లో పాచుర్యం పొందింది. అప్పట్లో టీ కుండల్లో తయారు చేసేవారు. ఈ టీని తాగడానికి చైనా మట్టి కప్పులు వాడేవారు.

know the secret behind tea making

know the secret behind tea making

Tea : ప్రపంచంలో దీనికున్న డిమాండే వేరు..

వేడివేడి చాయ్ అందులో పోసేసరికి అవి పగలిపోయేవి. దీంతో అక్కడి వారికి ఓ ఐడియా వచ్చింది. ముందుగా కప్పులో పాలు పోసి… అందులో వేడివేడి టీ పోసేవారు. దీంతో టీ ఉష్ణోగ్రత తగ్గడానికి పాలు సహయపడేవి. దీంతో మట్టి కప్పులు పగిలిపోయేవి కాదు. అప్పటి నుంచి ఈ ట్రెండ్ అలా మొదలైంది. అప్పట్లో టీ చాలా ఖరీదైంది. పైగా ఎక్కవ జనాభా పేదరికంలో మగ్గుతోంది. దీంతో టీ కప్పులు పగలకుండా ఈ పద్దతిని అనుసరిస్తుండేవారు. క్రమక్రమంగా ఇది ప్రపంచవ్యాప్తమైంది. తాజాగా ఓ నివేదిక ప్రకారం టీ ఇలా చేయడంతో రుచి కూడా పెరిగిందంటా.

Tags :

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది