Kodali Nani : ఎవరి సినిమాకైనా ఒకే విధానం.. మంత్రి కొడాలి నాని క్లారిటీ
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా భీమ్లా నాయక్ సినిమా ను పలు చోట్ల అడ్డుకోవడం తో పాటు అతి తక్కువ టికెట్ల రేట్ల పెట్టారంటూ పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. పవన్ ను తొక్కే ప్రయత్నాలు ఏపీ ప్రభుత్వం చేసిందని… టికెట్ల రేట్లు చాలా తగ్గించడం ద్వారా పవన్ కళ్యాణ్ కు నష్టం కలిగించేలా చూస్తున్నారు అంటూ పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు.పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కో లేక ఇలాంటి చర్యలు చేపడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఇటీవలే స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా మరో మంత్రి కొడాలి నాని స్పందించాడు. టికెట్ల పెంపుకు సంబంధించిన జీవో త్వరలో వస్తుందని తెలిసి కూడా ముందుగానే సినిమాని విడుదల చేయడం ద్వారా వివాదాన్ని కావాలని రేపినట్లు ఉందని కొడాలి నాని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ప్రస్తుత జీవో ప్రకారమే బంగార్రాజు మరియు అఖండ సినిమాలు కూడా విడుదలయ్యాయి. వాటికి ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. ప్రతి సినిమాకు కూడా ఒకే రూల్ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుందని పవన్ కళ్యాణ్ సినిమా అయినంత మాత్రాన ప్రత్యేకంగా రూ ఏమి వారికి వ్యతిరేకంగా చేయమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. రాబోయే సినిమాల విషయం లో కూడా అదే తరహాలో నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం అదే తరహాలో వ్యవహరిస్తుంది అంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
త్వరలో రాబోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు ఆ తర్వాత రాబోతున్న రాధేశ్యామ్ సినిమాకు కూడా అలాంటి కండిషన్స్ ఏపీ ప్రభుత్వం పెడుతుంది అంటున్నారు. ఆ సినిమాలకు టికెట్ల రేట్లు ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా ఉంది. ఈ సమయంలో మంత్రి కొడాలి నాని అన్ని సినిమాలకు ఒకే రూల్ అంటూ చేసిన వ్యాఖ్యలు క్లారిటీ ఇచ్చినట్లయ్యింది. పవన్ కళ్యాన్ కు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి పాత జీవోనే అని మంత్రి నాని తేల్చి చెప్పాడు.