Kodi Kathi : ‘ కోడి కత్తి ‘ మ్యాటర్ రకరకాల మలుపులు తిరుగుతోంది..!!
Kodi Kathi : కోడి కత్తి కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై నాలుగేళ్ల క్రితం జరిగిన కోడి కత్తి దాడి కేసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి కోడి కత్తిని కోళ్ల పందేలలో ఉపయోగిస్తారు. అది చాలా డేంజర్ కత్తి. ఎందుకంటే అది చూడటానికి చిన్నగానే ఉంటుంది కానీ.. దాంతో మనిషిని కూడా చంపేయొచ్చు. ఇప్పటికే కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కోర్టులో విచారణ నడుస్తోంది. ఈనేపథ్యంలో సంక్రాంతి నాడు అలాంటి కోడి కత్తి దాడిలో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి కోడి పందేలు జోరుగా సాగుతాయని తెలుసు కదా. పందెం కోళ్లకు కోడి కత్తిని కట్టి రంగంలోకి దించుతారు. అయితే.. కోళ్లకు కట్టిన ఈ కత్తులు తగిలి ఇద్దరు వ్యక్తులు వేర్వేరు చోట్ల ప్రాణాలు కోల్పోయారు. కోళ్ల పందేలు జరుగుతుండగా ఓ కోడి వేగంగా పందెం బరి నుంచి బయటికి దూసుకొచ్చింది. అక్కడున్న జనాల మీదికి ఎగబడింది. దీంతో దాని కాలికి కట్టిన కత్తి తాకి.. పద్మరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇంకో చోట పందెం కోడి కాలికి కత్తి కడుతూ.. అది పొరపాటున తగలడంతో సురేశ్ అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.
Kodi Kathi : పందెం కోడి కాలుకు కత్తి కడుతూ చనిపోయిన మరోవ్యక్తి
ఈ రెండు చోట్ల కేవలం కోడి కత్తి ప్రమాదవశాత్తు తగలడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరోసారి రాష్ట్రంలో కోడి కత్తి వ్యవహారం చర్చనీయాంశం అయింది. నిజానికి.. కోడి కత్తి చాలా డేంజర్ అనే విషయం అందరికీ తెలుసు. కానీ.. అది మనుషుల ప్రాణాలు తీస్తుంది అనేది తాజాగా అర్థం అయింది. దాని వల్ల మనిషికి ప్రమాదమని తెలిసినా ఎప్పుడూ మనుషులు చనిపోయిన దాఖలాలు లేవు. కానీ.. తాజాగా కోడి కత్తి వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఈ వ్యవహారం మళ్లీ ఏపీలో చర్చనీయాంశం అయింది.