Sreekaaram : శ్రీకారం ప్రీరిలీజ్ ఈవెంట్ కి కేటీఆర్ ఎందుకొచ్చాడో తెలుస్తే షాకవుతారు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreekaaram : శ్రీకారం ప్రీరిలీజ్ ఈవెంట్ కి కేటీఆర్ ఎందుకొచ్చాడో తెలుస్తే షాకవుతారు..?

 Authored By govind | The Telugu News | Updated on :11 March 2021,1:15 pm

Sreekaaram : శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యంగ్ హీరో శర్వానంద్. అప్పుడెప్పుడో శతమానం భవతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు. పడి పడిలేచే మనసు, రణ రంగం, జాను లాంటి సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలేవి శర్వానంద్ కి హిట్స్ ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా జాను సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ఈసారి చేసే సినిమాతో భారీ హిట్ కొట్టాలని తనకి బాగా కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ కథనే మళ్ళీ ఎంచుకున్నాడు.

అయితే శర్వానంద్ శ్రీకారం సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు రాష్ట్రాలలో ప్రధాన సమస్య అయిన వ్యవసాయానికి సంబంధించిన కథాంశాన్నీ ప్రేక్షకులను చెప్పబోతున్నాడు. ఇప్పటికే ఈ కథాంశం తో చాలా సినిమాలు వచ్చినప్పటికి ఈ సినిమాలో చర్చించే అంశాలు ఎంతో కీలకమైనవన్న టాక్ వినిపిస్తోంది. యూనివర్సల్ గా ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ శ్రీకారం సినిమాలో చాలానే ఉన్నాయట. అయితే ఈ పాయింట్స్ అన్నీ టార్గెటెడ్ గా అందరికీ రీచ్ అవ్వాలంటే ప్రమోషన్స్ లో ఒక డైనమిక్ పర్సన్ ఉండాలి.

KTR AT Sreekaram Movie Event

KTR AT Sreekaram Movie Event

Sreekaaram : శ్రీకారం సినిమాలో శర్వానంద్ ఇదే అంశాన్ని చెప్పబోతున్నాడు.

అందుకే శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కేటీఆర్ ని ఆహ్వానించారట. ఈ విషయాన్ని స్వయంగా హీరో శర్వానంద్ స్వయంగా వెల్లడించాడు. కేటిఆర్ లాంటి డైనమిక్ నాయకుడు శ్రీకారం గురించి మాట్లాడితే దాదాపు అందికి చేరుతుందని అభిప్రాయపడ్డాడు. సమిష్టి వ్యవసాయం ఒక లాభదాయక పద్ధతి. ఈ ప్రక్రియలో లాభాలను సమానంగా పంచుకోగలిగితే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. ఇదే అంశాన్ని శ్రీకారం సినిమాలో శర్వానంద్ చెప్పబోతున్నాడు. చూడాలి మరి ఈ సినిమా ఎంతమందిని ఆకట్టుకుంటుదో. ఇక ఇప్పటికే శ్రీకారం సినిమా మీద ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు మొదలయ్యాయి.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది