స్పామ్ మెయిల్ చేస్తున్నారా…? చెక్ చేసి మిలియనీర్ అయిపోయింది…!
స్పామ్ మెయిల్ చూసే అలవాటు ఉండదు మనకు. స్పామ్ మెయిల్ చాలా వరకు ఉపయోగం ఉండదని ఏదో పిచ్చి పిచ్చి మెయిల్స్ వస్తూ ఉంటాయని వదిలేస్తాం. కాని ఒక అమ్మాయి లైఫ్ మార్చేసింది ఒక స్పామ్ మెయిల్. అమెరికాలోని ఒక్లాండ్ కౌంటీకి చెందిన 55 ఏళ్ళ లారా స్పియర్స్ అదృష్టాన్ని మార్చేసింది స్పామ్ మెయిల్. స్పామ్ ఫోల్డర్ కు లాటరీ ప్రైజ్ మనీని గెలుచుకున్నట్లు మెసేజ్ వచ్చింది.
ఆమె గత ఏడాది చివరి రోజున మిచిగాన్ లాటరీ వెబ్‌సైట్‌లో మెగా మిలియన్స్ టిక్కెట్ కొనుక్కుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు స్పామ్ లో మెసేజ్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయింది. దీనిపై ఆమె మాట్లాడుతూ తన సన్నిహితుల మెయిల్ కోసం తాను స్పామ్ మెయిల్ చెక్ చేస్తున్నాను అని అప్పుడే తనకు లాటరీ వచ్చినట్టుగా మెయిల్ కనపడింది అని వివరించింది.
మూడు మిలియన్ డాలర్లు తన సొంతం అయినట్టుగా ఆమె వివరించింది. మిచిగాన్ లాటరీ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని ప్రకటించింది. గత వారం కూడా ఆమెకు ఇదే విధంగా లాటరీ వచ్చింది. ఒక్కసారిగా అంత మొత్తం రావడంతో షాక్ లో ఉన్న ఆమె ఇక తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ప్రకటించింది.