LIC Scheme : ఈ స్కీమ్ లో చేరితే… ప్రతినెల రూ.12,000 పెన్షన్ పొందవచ్చు
LIC Scheme : పెన్షన్ పొందాలనుకునేవారు ఈ స్కీమ్ లో చేరారు అంటే ప్రతినెల రూ.12,000 పెన్షన్ పొందవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన కోట్లాది మంది కస్టమర్లు, పెట్టుబడిదారుల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. మంచి రాబడి, సురక్షితమైన పెట్టుబడి కోసం ఎల్ఐసి కి మించిన మరొకటి లేదు. ఈ ఎల్ ఐసి పాలసీలో పిల్లలనుంచి వృద్ధుల వరకు ఎన్నో స్కీములు ఉన్నాయి. అందులో ఒకటే సరళ పెన్షన్ పథకం. ఈ పథకం వృద్ధులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత పెన్షన్ వస్తుంది.
ఎల్ఐసి సరళ పెన్షన్ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీని ద్వారా మీరు జీవితాంతం పెన్షన్ పొందుతారు. ఒకవేళ పాలసీదారు మరణిస్తే ఆ పెట్టుబడి మొత్తం నామినీకి చెందుతుంది. ఈ స్కీంను 40 ఏళ్ల వయసు నుంచి 80 ఏళ్ల వయసు వరకు లబ్ధి పొందవచ్చు. మీరు ఒంటరిగా ఉన్న, భార్యాభర్తల తో కలిసి ఉన్న సరే ఈ స్కీంలో చేరవచ్చు. పాలసీదారు ఈ పాలసీని మొదలుపెట్టిన తారీఖు నుంచి అవసరం అయితే ఆరు నెలల తర్వాత సరెండర్ చేసే అవకాశం ఉంటుంది.

LIC offers these scheme you can earn monthly 12,000 rupees
ఈమధ్యనే రిటైర్మెంట్ అయిన వ్యక్తులు నెలకు రూ.12,000 పెన్షన్ పొందవచ్చు. రిటైర్మెంట్ తర్వాత పిఎఫ్ ఫండ్ నుంచి వచ్చిన డబ్బు ను ఇందులో పెట్టుబడిగా పెడితే సులువుగా పెన్షన్ పొందుతారు. ఎల్ఐసి లెక్కల ప్రకారం 42 ఏళ్ల వ్యక్తి 30 లక్షల ప్లాన్ ను కొనుగోలు చేస్తే అతను ప్రతి నెల రూ.12,388 పెన్షన్ను పొందవచ్చు. ఈ స్కీం లో పెట్టుబడికి పరిమితి లేదు. ఒకసారి ప్రీమియం చెల్లించిన తర్వాత వార్షిక, అర్థవార్షిక, త్రైమాసిక నెలవారి ప్రాతిపదికన పెన్షన్ తీసుకోవచ్చు.