Lord Ganesh : ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుని బొమ్మ ఉంచితే ఏమవుతుంది..? తప్పక తెలుసుకోండి…!
Lord Ganesh : హిందూ సాంప్రదాయం ప్రకారం గణేషుడు మొదటి పూజ అందుకునే దేవుడు. అందుకే ఏ శుభకార్యం లోనైనా సరే ముందుగా వినాయకుడిని పూజిస్తారు. పండుగైన , శుభకార్యమైన మరేదైనా ఫంక్షన్ అయినా సరే ముందు గణపయ్యను ప్రార్ధించి కార్యక్రమాలను మొదలుపెడతారు. మొదటి పూజ వినాయకుడికి చేయడం వలన ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేలా వినాయకుడు చూస్తాడని హిందువుల నమ్మకం. అందుకే హిందూ సాంప్రదాయాలలో ఏ పని మొదలుపెట్టిన కూడా ముందుగా […]
ప్రధానాంశాలు:
Lord Ganesh : ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుని బొమ్మ ఉంచితే ఏమవుతుంది..? తప్పక తెలుసుకోండి...!
Lord Ganesh : హిందూ సాంప్రదాయం ప్రకారం గణేషుడు మొదటి పూజ అందుకునే దేవుడు. అందుకే ఏ శుభకార్యం లోనైనా సరే ముందుగా వినాయకుడిని పూజిస్తారు. పండుగైన , శుభకార్యమైన మరేదైనా ఫంక్షన్ అయినా సరే ముందు గణపయ్యను ప్రార్ధించి కార్యక్రమాలను మొదలుపెడతారు. మొదటి పూజ వినాయకుడికి చేయడం వలన ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేలా వినాయకుడు చూస్తాడని హిందువుల నమ్మకం. అందుకే హిందూ సాంప్రదాయాలలో ఏ పని మొదలుపెట్టిన కూడా ముందుగా వినాయకుని ప్రార్ధించి పూజిస్తారు. అంతేకాక కొంతమంది వారి ఇంటి ప్రధాన ద్వారానికి వినాయకుని డిజైన్స్ ను కూడా ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరు తలుపులకు వినాయకుడి ఫోటోలను లేదా విగ్రహాలను డిజైన్ చేపిస్తారు. మరి ఇంటి ప్రధాన ద్వారానికి ఈ విధంగా వినాయకుని ఫోటోలు పెట్టడం అనేది మంచిదేనా.?ఈ విధంగా చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో చాలామంది వారి ఇంటి ప్రధాన ద్వారానికి రకరకాల దేవుళ్ళ యొక్క డిజైన్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ఇంటి ముందు వినాయకుడి బొమ్మ లేదా విగ్రహాలని ఉంచుతున్నారు. అయితే ఇంటి ప్రధాన ద్వారం పై భాగంలో వినాయకుడి బొమ్మను ఉంచడం లేదా డిజైన్ చేపించడం వలన కుటుంబానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐశ్వర్యం చేకూరుతుందని నమ్మకం. అంతేకాక ఆ ఇల్లు సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వలన ఇంటికి శుభం కలుగుతుందని తెలియజేస్తున్నారు. వినాయకుడి యొక్క ఫోటోను ప్రధాన ద్వారం పై భాగంలో ఉంచడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు.
దీంతో ఇంట్లో సానుకూల పరిస్థితులు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉంటుంది. అంతేకాక ప్రధాన ద్వారం పై భాగంలో వినాయకుని బొమ్మ ఉంచడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయట. దీంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి మనశ్శాంతి లభిస్తుంది. ఇక ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లే ముందు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కరించి వెళ్ళినట్లయితే ఆ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని పండితులు తెలియజేయడం జరిగింది. కావున ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడు బొమ్మలు ఉంచడం శుభప్రదం.