Nalgonda : బ్రేకింగ్.. నల్గొండలో మొండెం కలకలం.. మహంకాళి విగ్రహం కాళ్ల వద్ద వ్యక్తి మొండెం ప్రత్యక్షం..!
Nalgonda : నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. గొల్లపల్లి గ్రామంలోని మెట్టు మహంకాళి దేవాలయంలో దేవత కాళ్ళ విగ్రహం వద్ద వ్యక్తి మొండెం వేరు చేసిన తల దర్శనమిచ్చింది. విరాట్ నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్-నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి పై ఉన్న ఈ అమ్మవారి విగ్రహం వద్ద గుర్తు తెలియని దుండగులు… వ్యక్తిని చంపి అతని తలను వదిలి వెళ్ళారు. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా మృతుడి పూర్తి శరీరం ఎక్కడుందో.. అసలు ఆ మొండెం ఎవరిది అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

Man torso live at the feet of the idol of Mahankali in Nalgonda
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి.. సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
WhatsApp Group
Join Now