Alla Ramakrishna Reddy : పరామర్శ పేరుతో లోకేశ్ రాజకీయం చేయడానికి వచ్చారు : ఆర్కే ధ్వజం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Alla Ramakrishna Reddy : పరామర్శ పేరుతో లోకేశ్ రాజకీయం చేయడానికి వచ్చారు : ఆర్కే ధ్వజం

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 April 2022,9:30 pm

Alla Ramakrishna Reddy : పోలీసులపై టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడి చేయడాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తీవ్రంగా తప్పు పట్టారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తుమ్మపూడిలో చోటు చేసుకున్న ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.

తుమ్మపూడి ఘటన జరిగిన వెంటనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబాలను కూడా అన్ని విధాలా ఆదుకుంటాం. అయితే.. పరామర్శ పేరుతో వచ్చిన లోకేశ్.. రాజకీయం చేశారని.. శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని ఆయన చెడగొట్టారని ఆర్కే మండిపడ్డారు.పరామర్శకు వచ్చి నారా లోకేశ్ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆళ్ల ధ్వజమెత్తారు. మీ రాజకీయాల కోసం పోలీసులను బలి చేస్తారా? వాళ్లపై రాళ్లు రువ్వడం ఏంటి. లోకేశ్ వచ్చేదాకా..

mangalagiri mla ramakrishna reddy about thummapudi incident

mangalagiri mla ramakrishna reddy about thummapudi incident

Alla Ramakrishna Reddy :  పరామర్శకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారా?

మృతదేహాన్ని ఆసుపత్రిలో వద్దనే ఉంచాలని అడ్డుకోవడం ఏంటి? టీడీపీ కావాలని ఈ ఘటనపై రాద్ధాంతం చేయడం ఏంటి? ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకుంటే అది టీడీపీకే నష్టం. శవాల మీద కూడా పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారా? ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. టీడీపీ నేతలు ఇలాంటి పనులు చేయడం వాళ్ల విజ్ఞతకు నిదర్శనం అని ఎమ్మెల్యే దుయ్యబట్టారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది