Alla Ramakrishna Reddy : వైయస్ షర్మిలకు భారీ షాక్… మళ్లీ వైసీపీకి లోకి చేరనున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Alla Ramakrishna Reddy : వైయస్ షర్మిలకు భారీ షాక్… మళ్లీ వైసీపీకి లోకి చేరనున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..!

 Authored By aruna | The Telugu News | Updated on :20 February 2024,2:30 pm

ప్రధానాంశాలు:

  •  Alla Ramakrishna Reddy : వైయస్ షర్మిలకు భారీ షాక్... మళ్లీ వైసీపీకి లోకి చేరనున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..!

Alla Ramakrishna Reddy : గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలోకి వెళ్ళనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014 , 2019లో వైసీపీ తరపున మంగళగిరి నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి పైన 12 ఓట్ల తేడాతో గెలుపొందిన ఆయన 2019లో నారా లోకేష్ పై 5300 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం పైన ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టు,లో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. కాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీటు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్కే పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళగిరి సీటును టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి కేటాయించారు వైయస్ జగన్.

అయితే గత పది ఏళ్లుగా మంగళగిరిలో ఆర్కే ఎమ్మెల్యేగా ఉండడం వైసీపీ క్యాడర్ అంత ఇప్పటికి ఆయనతోనే ఉండటం వలన వైయస్ జగన్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు, రాజధాని భూముల అంశంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆర్కే కు అన్యాయం జరిగిందని మాట రాకుండా వైయస్ జగన్ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. దీంతో వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి , విజయసాయిరెడ్డి లను ఆర్కేతో చర్చించాలని వైయస్ జగన్ ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే గంజి చిరంజీవిని మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించిన ఆయన అభ్యర్థిత్వం పై వైసీపీ క్యాడర్ అసంతృప్తిగా ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వైసీపీలో ఉన్న మంగళగిరి మాజీ ఎమ్మెల్యేలు కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావుల్లో ఒకరికి టికెట్ ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం ఏడు విడతల్లో వైయస్ జగన్ అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో మళ్లీ కొన్ని స్థానాలలో మార్పులు చేశారు. ఈ క్రమంలో మంగళగిరిలో కూడా మార్పు ఉంటుందని అంటున్నారు. గంజి చిరంజీవి స్థానంలో కాండ్రు కమల లేదా మురుగుడు హనుమంతరావులలో ఒకరు అభ్యర్థి కావచ్చని అంటున్నారు లేదా ఆర్కేతో చర్చలు ఫలిస్తే మూడోసారి కూడా ఆయనే వైసీపీ అభ్యర్థి అయిన ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఆర్కే సన్నిహితులు కూడా మళ్లీ వైసీపీలోకి వెళ్లాలని ఆయనకి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం ముఖ్య నేతల ద్వారా ఆయనతో చర్చించడానికి ఏర్పాట్లు చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. ఈ వారంలోనే ఆర్కే రాక నిర్ణయం ఉంటుందని సమాచారం.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది