Alla Ramakrishna Reddy : ఆళ్ల రామకృష్ణారెడ్డి వై.యస్.జగన్మోహన్ రెడ్డి మీద ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఇదే ..??
Alla Ramakrishna Reddy : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేసి కోర్టుకు వెళతానని అంటున్నారు. నారా లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద లీగల్ గా కోర్టులో ఎలా పోరాటం చేసానో అలాగే వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి పై కూడా కేసు పెట్టి న్యాయస్థానానికి తీసుకెళ్తానని అంటున్నారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి తో, […]
ప్రధానాంశాలు:
Alla Ramakrishna Reddy : ఆళ్ల రామకృష్ణారెడ్డి వై.యస్.జగన్మోహన్ రెడ్డి మీద ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఇదే ..??
Alla Ramakrishna Reddy : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేసి కోర్టుకు వెళతానని అంటున్నారు. నారా లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద లీగల్ గా కోర్టులో ఎలా పోరాటం చేసానో అలాగే వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి పై కూడా కేసు పెట్టి న్యాయస్థానానికి తీసుకెళ్తానని అంటున్నారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి తో, వైయస్ ఫ్యామిలీతో అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద సంచలనంగా మారింది. ఇటీవల ఆయన వై.యస్ షర్మిలను కలిశారు. ఆమె పార్టీకి సపోర్ట్ చేస్తానని కూడా చెప్పారు. మంగళగిరిలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం ఫండ్స్ రిలీజ్ చేయలేదని, తాను అప్పులు తీసుకొచ్చి మరి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ఆళ్ల రామకృష్ణారెడ్డి షాక్ ఇచ్చారు.
సొంత అధికారపక్షంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఇది చేయలేదని చెప్పారు. ఇది వైసీపీ ప్రభుత్వానికి అవమానకరం. దీనిపై వైసీపీకి ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జ్ గంజి చిరంజీవి ప్రెస్ మీట్ పెడతారా, ఆయన చెప్పింది అబద్ధమని చెబుతారా లేక ఆయన కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పై యుద్ధం ప్రకటిస్తారా అనేది చూడాలి. వై.యస్.జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్లు తన దృష్టికి వస్తే తాను కూడా వై.యస్.జగన్మోహన్ రెడ్డి మీద లోకేష్, చంద్రబాబు మీద పోరాడినట్లు లీగల్గా వెళతానని చెప్పారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంగళగిరి తో పాటు కొన్ని నియోజకవర్గాలకి ఫండ్స్ ఇవ్వలేదని, చాలామంది ఎమ్మెల్యేలు సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉందని ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే ఆయన వై.యస్.షర్మిలను చూసి ఇలా మాట్లాడారా లేక ప్రజల బలాన్ని చూసుకొని మాట్లాడారా అనేది ఆసక్తికరంగా మారింది. సొంత పార్టీ అభ్యర్థి వై.యస్.జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో నిజంగానే మంగళగిరి నియోజకవర్గానికి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఫండ్స్ ఇవ్వలేదా అని జనాలు చర్చించుకుంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతానని అనడం ఆసక్తికరంగా మారింది. నిజంగా ఆయన తప్పు చేసినట్లు తెలిస్తే పూర్తి ఆధారాలతో సుప్రీంకోర్టు, హైకోర్టులో లీగల్ కేసు వేస్తానని అన్నారు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో మారాయి.