Meal Maker Dum Biryani : మీల్ మేకర్ దమ్ బిర్యాని ఇలా చేస్తే సూపర్ గా.. మ‌ట‌న్ బిర్యాని కంటే టేస్టీగా ఉంటుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Meal Maker Dum Biryani : మీల్ మేకర్ దమ్ బిర్యాని ఇలా చేస్తే సూపర్ గా.. మ‌ట‌న్ బిర్యాని కంటే టేస్టీగా ఉంటుంది…

 Authored By aruna | The Telugu News | Updated on :30 September 2022,7:00 am

Meal Maker Dum Biryani : చాలామంది నాన్ వెజ్ అంటే ఇష్టపడరు అలాంటివారు నాన్ వెజ్ బిర్యానీ తిన్నట్లుగా. ఉండాలి నాన్ వెజ్ తినకూడదు.. అనేటటువంటి వారు ఈ మీల్ మేకర్ దమ్ బిర్యాని ఒక్కసారి తిన్నారంటే ఇక దానిని అస్సలు వదలరు… ఇప్పుడు ఈ మెయిల్ మేకర్ దమ్ బిర్యాని తయారు చేసుకుందాం.. కావలసిన పదార్థాలు : మీల్ మేకర్, బాస్మతి రైస్, పెరుగు ,బిర్యానీ మసాలా, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, క్యారెట్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్, బఠానీలు, నిమ్మరసం ఆయిల్, నెయ్యి, ఉల్లిపాయలు, యాలకులు, లవంగాలు, సాజీర, యాలకులు, జాపత్రి, ఒక బిర్యానీ, ఆకు, దాల్చిన చెక్క, మొదలైనవి…

తయారీ విధానం : ముందుగా ఒక కప్పు మీల్ మేకర్ ని తీసి వేడినీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు పెరుగు, రెండు స్పూన్ల కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ నీ చేత్తో గట్టిగా పిండి ఈ మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి పచ్చి బఠాణి ఒక కప్పు, పచ్చిమిర్చి నాలుగైదు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం క్యారెట్ ముక్కలను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,ఇక చివర్లో కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపుకోని పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బిర్యాని గిన్నెను స్టవ్ పై పెట్టి దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు ఉల్లిపాయలను వేసి బ్రౌన్ గా వచ్చేవరకు వేయించి దాంట్లో నుంచి సగం తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత దానిలో కొంచెం షాజీరా, రెండు యాలకులు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక జాపత్రి, ఒక స్టార్, కొంచెం మిరియాలు వేసి వేయించుకోవాలి.

Meal Maker Dum Biryani is super tastier than Mutton Biryani if ​​done this way

Meal Maker Dum Biryani is super tastier than Mutton Biryani if ​​done this way.

తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ను వేసి కొంచెం వాటర్ ని వేసి స్టవ్ ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇక తర్వాత స్టౌ పై ఒక గిన్నెను పెట్టుకొని దానిలో నీళ్లను పోసి దాంట్లో కొంచెం సాజీర కొంచెం యాలకులు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక స్టార్ జాపత్రి, ఒక బిరియాని, ఆకు వేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం నెయ్యి , కొంచెం ఉప్పు వేసి వాటర్ మసలనివ్వాలి. తర్వాత ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసి 70% వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఆ రైస్ ని తీసి మీల్ మేకర్ మిశ్రమంలోకి లేయర్లుగా వేసుకొని, ఇక దానిపై ముందుగా చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అలాగే వేడి వేడి నూనెలో కొంచెం పసుపు వేసి ఆ ఆయిల్ ని దానిపైన వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి దానిపై బరువును పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే పది నిమిషాల తర్వాత స్టౌ కట్టేసి ఒక పది నిమిషాలు ఉంచేసి తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ బిర్యాని రెడీ..

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది