KTR : డిసెంబర్ నుండి తెలంగాణలో వాళ్లకి ₹3లక్షలు మంత్రి కేటీఆర్ సంచలన హామీ..!!
KTR : వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తీవ్రస్థాయిలో ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఒకపక్క ఉపఎన్నికలు మరోపక్క ప్రభుత్వంపై పోరాటాలు రకరకాలుగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఇటీవల మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ గెలవడంతో ..ఆ పార్టీ మరింతగా దూసుకుపోతుంది. దీనిలో భాగంగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ప్రజలకు టిఆర్ఎస్ నేతలు సంచలన హామీలు ఇస్తున్నారు.
మరోపక్క సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మంత్రి కేటీఆర్ అదిరిపోయే శుభవార్త తెలియజేశారు. విషయంలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని నిరుపేదలకు టిఆర్ఎస్ ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు అందించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ పథకాన్ని డిసెంబర్ నెల నుండి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూర అయ్యి నిర్మాణాలు జరగని గ్రామాలలో రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
ఇదే సందర్భంలో ₹5.04 లక్షల పథకం మంజూరు కాని వారిని ₹3లక్షల పథకంలో అర్హులుగా గుర్తించాలని సూచించారు. ఈ రెండు పథకాలకు సంబంధించి వ్యత్యాసాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోని వివరించాలని పేర్కొన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని.. ఏడాదిలో కంప్లీట్ అవ్వాలని సూచించారు. ఇక నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల సంఖ్యను రెండు వందల నుంచి వెయ్యికి పెంచినట్లు పేర్కొన్నారు.