Roja : రోజాకు బంపర్ ఆఫర్.. మంత్రి పదివి ఫిక్స్!
Roja : ఏపీ కేబినెట్‌లో మార్పుపై ఎప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అది పైనల్ దకు చేరుకుందని సమాచారం. కొత్త కూర్పు కోసం సీఎం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. కేబినెట్ లో కొందరిని తప్పించి వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఒకరిద్దరు మంత్రులతోనూ కేబినెట్ ప్రక్షాళన విషయమై సీఎం డిస్కషన్ చేసినట్టు సమాచారం. ఇక కొత్తగా ఏర్పాటు కాబోయే కేబినెట్ […]
Roja : ఏపీ కేబినెట్‌లో మార్పుపై ఎప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అది పైనల్ దకు చేరుకుందని సమాచారం. కొత్త కూర్పు కోసం సీఎం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. కేబినెట్ లో కొందరిని తప్పించి వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఒకరిద్దరు మంత్రులతోనూ కేబినెట్ ప్రక్షాళన విషయమై సీఎం డిస్కషన్ చేసినట్టు సమాచారం. ఇక కొత్తగా ఏర్పాటు కాబోయే కేబినెట్ లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు టాక్. తన కేబినెట్ లో ప్రస్తుతం ముగ్గురు మహిళలకు చాన్స్ ఇచ్చారు.
కేబినెట్ మార్పలో భాగంగా ఆ సంఖ్య ఐదుకు చేరనుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఎస్టీ వర్గానికి చెందిన పుష్ఫశ్రీ వాణి డిప్యూటీ సీఎంగా.. ఎస్సీ వర్గానికి చెందిన సుచరిత హోం మంత్రిగా.. ఎస్సీ వర్గానికి చెందిన తానేటి వనిత మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక కేబినెట్ విస్తరణలో కొత్తగా మరో ఇద్దరికి చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా పదవులు కేటాయించనున్నట్టు టాక్. ఒక వేళ ఎస్టీ వర్గానికి చెందిన వారికి స్పీకర్ పదవిని కట్టబెడితే ఆ వర్గానికి మంత్రి పదవి దక్కే చాన్స్ లు దాదాపుగా ఉండవు.
ఓసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలంటే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. మొదటి కేబినెట్ విస్తరణ సమయంలోనే రోజాకు మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ చాన్స్ దక్కలేదు. ఇక ప్రస్తుతం పెద్దిరెడ్డి, బొత్సా, కొడాలి నానికి పార్టీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో.. రోజాకు మహిళా కోటాలో చిత్తూరు నుంచి రూట్ క్లియర్ కానున్నది. ఒక వేళ ఇదే జరిగితే జగన్ కేబినెట్ లో రోజాకు వంద శాతం చాన్స్ ఉన్నట్టే. ఇక చివరి నిమిషంలో జగన్ తీసుకునే నిర్ణయంపైనే అసలు కథ ఆధారపడి ఉంటుంది.