Mobile : మొబైల్ పోయిందా… అయితే ఇలా చేయండి..
Mobile : మొబైల్ ఫోన్ మనం అనుకోకుండా పోగొట్టుకుంటాం. ఇలాంటి సమయంలో అందరికీ ముందుగా వచ్చే ఆలోచన ఏంటంటే.. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం. ఇలా స్టేషన్ వెళ్లకుండా httpr.//cybercrime.gov.in అనే వెబ్‌సైట్‌లో రిపోర్టింగ్ పోర్టల్‌లో కంప్టైంట్ చేయొచ్చు. ఫిరాదును నమోదు చేసేందుకు 1930 నంబర్ కు సైతం కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. భారతీయ టెలికాం డిపార్ట్ మెంట్ httpr.//ceir.gov.inలో సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా మీరు పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చు.
ట్రాక్ చేయవచ్చు.ఐఎంఈఐ నంబర్ ప్రత్యేకంగా ఒక్కో ఫోన్ కు కేటాయించబడుతుంది. సీఈఐఆర్ పోర్టల్ లో రిస్టర్ ద్వారా మీ మొబైల్ నంబర్ ను బ్లాక్ చేస్తే ఆ మొబైల్ హ్యాండ్ సెట్ ఏ మొబైల్ నెట్ వర్క్ కంపెనితోనూ ఎటువంటి నెట్ వర్క్ కవరేజీని ప్రారంభించదు. ఇదిలా ఉండగా.. సెకండ్ హ్యాండ్, బాగు చేసిన ఫోన్ లను కొనుగోలు చేసే సమయంలో ముందుగా కేవైసీ ఫీచర్ ను ఉపయోగించాలి. ఎందుకుంటే ఈ మొబైల్ బ్లాక్ లిస్టులో ఉందా లేదా నకిలీదా? ఇప్పటికే వేరొకరు ఉపయోగిస్తున్నారా అనే వివరాలు తెలుసుకోవచ్చు.
Mobile : ఐఎంఈఐ నంబర్ మస్ట్
మీరు కొనుగోలు చేసే ఫోన్ తప్పనిసరిగా ప్యాకేజింగ్ బాక్స్ లేదా మొబైల్ బిల్లు, ఇన్వాయిస్ ఐఎంఈఐ నంబర్ రాసి ఉండాలి. ఇలాంటి వివరాలన్నీ ముందుగా తెలుసుకన్న తర్వాతే మొబైల్ కొనుగోలు చేయడం ఉత్తమం లేదంటే.. ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఈ జాగ్రత్తలు పాటించండి. తక్కువ ధరకే ఫోన్ వస్తుంది కదా అని ఈ విషయాలు చెక్ చేసుకోకుండా కొనుగోలు చేస్తే అనేక ఇబ్బందుల పాలవక తప్పదు. ఎందుకంటే అది గతంలో ఎవరు వాడారో లేక దొంగతనం చేసి అమ్ముతున్నారో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం బెటర్.