Munugode : మునుగోడు ముచ్చట.. ముగ్గురికీ కష్టమే సుమీ.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Munugode : మునుగోడు ముచ్చట.. ముగ్గురికీ కష్టమే సుమీ.!

Munugode : తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం విదితమే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన ఇటీవల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక తప్పనిసరైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నికపై స్పందించాల్సి వుంది. ఈలోగా మునుగోడులో రాజకీయం వేడెక్కింది. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని బహిరంగ సభలు నిర్వహించేశాయి. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 August 2022,6:30 am

Munugode : తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం విదితమే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన ఇటీవల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక తప్పనిసరైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నికపై స్పందించాల్సి వుంది. ఈలోగా మునుగోడులో రాజకీయం వేడెక్కింది.
ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని బహిరంగ సభలు నిర్వహించేశాయి. అవి మరింత ఉధృతం కాబోతున్నాయి.

ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్.. ఇక్కడ పోటీ పడుతున్నాయి. వీటిల్లో ఏ పార్టీకి విజయం దక్కుతుంది.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఏ రాజకీయ పార్టీ అయినాసరే, చేతికి ఎముక లేదన్నట్టు ఖర్చు చేయాల్సి వుంటుంది మునుగోడు ఉప ఎన్నిక కోసం. స్థానికంగా కొందరు ఓటర్లు, 10 వేలు ఇస్తేనే ఓటు వేస్తాం.. అనే స్థాయికి రాజకీయ పార్టీలకు అల్టిమేటం జారీ చేస్తున్నారట. ‘అవి మా డబ్బులే కదా..’ అని కూడా కొందరు ఓటర్లు నినదిస్తుండడం గమనార్హం. దాంతో, రాజకీయ పార్టీలకు వెన్నులో వణుకు పుడుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలబెట్టుకోవాల్సి వుంటుంది.

Munugode Fight All Three Are In Danger

Munugode Fight, All Three Are In Danger

మరోపక్క, అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవాల్సిన అగత్యం అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీది ఇంకో కష్టం. కాంగ్రెస్ పార్టీకి అది సిట్టింగ్ స్థానం. దాంతో, మునుగోడులో గెలిచి వచ్చే ఎన్నికల కోసం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇలా మూడు పార్టీలకీ ఈ మునుగోడు ఉప ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారబోతోంది. ముఖ్యమంత్రి కేసీయార్ ఎలాగూ రంగంలోకి దిగుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారట. ఏమో, రాహుల్ గాంధీ కూడా దిగుతారేమో.! తప్పదు, మూడు పార్టీలకీ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక చావో రేవో అన్నట్టుంది మరి.!

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది