Nara Bhuvaneshwari : ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన కామెంట్స్‌పై నారా భువనేశ్వరి రియాక్షన్ ఇదే..
Nara Bhuvaneshwari : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్యను దూషించారని వెక్కి వెక్కి ఏడ్చారు చంద్రబాబు. కాగా, ఆ కామెంట్స్‌పై నారా చంద్రబాబు నాయుడు వైఫ్ నారా భువనేశ్వరి తాజాగా స్పందించారు.ఏపీలోని తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయాన్ని నారా భువనేశ్వరి స్పందించారు. అనంతరం వరద ప్రమాద మృతులకు ట్రస్ట్ తరఫున భువనేశ్వరి ఆర్థికసాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం చేశారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. దేశంలో ఏ ఆపద వచ్చినా.. ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని చెప్పారు. తనను అవమానించిన వాళ్లు, వాళ్ల పాపాన వాళ్లే పోతారని నారా భువనేశ్వరి అన్నారు. తనపై కామెంట్స్ చేసిన వారి గురించి ఆలోచించేస సమయం తనకు లేదని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఎవరైనా సరే మహిళలను గౌరవించాలని, నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని భువనేశ్వరి అన్నారు.తనకు అన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు మద్దతుగా నిలడ్డారని భువనేశ్వరి తెలిపారు. హెరిటేజ్‌ను కూలగొట్టడానికి చాలా మంది ట్రై చేశారని ఆరోపించారు.
Nara Bhuvaneshwari : ఘాటుగా రియాక్ట్ అయిన భువనేశ్వరి..
ఈ క్రమంలోనే హెరిటేజ్ సంస్థ కార్యకలాపాలు చాలా ట్రాన్స్పరెంట్‌గా ఉంటాయని, హెరిటేజ్ సంస్థను ఎవరూ టచ్ చేయలేరని భువనేశ్వరి అన్నారు. నారా భువనేశ్వరిపై వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. తాను సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చంద్రబాబు ఈ సందర్భంగా శపథం చేశాడు. ఇక అప్పటి నుంచి ఏపీ రాజకీయ క్షేత్రం బాగా హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైం ఉన్నప్పటికీ రాజకీయ క్షేత్రంలో టీడీపీ అధికార వైసీపీపై పోరుకు సిద్ధమవుతోంది.