YS Jagan : ప్రతి దాంట్లో తలదూర్చేప్పుడు కాస్త ఆలోచించు లోకేష్ బాబు..!
YS Jagan : తెలుగు దేశం పార్టీ అధినేత తనయుడు నారా లోకేష్ మరోసారి తన పరువు తానే తీసుకున్నట్లుగా మాట్లాడాడు. వైకాపా ప్రభుత్వం పై ఏదో ఒక విషయంలో విమర్శలు చేయాలనే ఉద్దేశ్యంతో లోకేష్ విషయం ఏంటీ అనేది కూడా చూడకుండా విమర్శలు చేయడం మొదలు పెడుతున్నాడు. కడప జిల్లా పులివెందులలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన పూర్తి వివరాలు తెలియకుండానే వైఎస్ అనే పదం ఉండగానే వెంటనే రెచ్చి పోయి మరీ విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. ఆయన పార్టీ నాయకులు సైతం ఆయనకు వంత పాడారు. దాంతో లోకేష్ పరువు పోయింది.
అసలు విషయం ఏంటీ అంటే పులివెందులకు చెందిన వైఎస్ కొండారెడ్డి ఒక కాంట్రాక్టర్ ను బెదిరిస్తున్నట్లుగా కేసు నమోదు అయ్యింది. వైఎస్ అనగానే జగన్ యొక్క కుటుంబ సభ్యులు అనే ఉద్దేశ్యంతో లోకేష్ రంగంలోకి దిగాడు. జగన్ కు దూరపు బంధువు అయిన కొండారెడ్డి కాంట్రాక్టర్ ను బెదిరించిన విషయం బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. వైకాపా పార్టీ నాయకుడు అయినా కూడా.. జగన్ కు బంధువు అయినా కూడా అస్సలు వదిలేది లేదు అంటూ కొండా రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది.
సీఎం జగన్ బందు ప్రీతి లేకుండా కాంట్రాక్టర్ లను బెదిరించిన వారిని ఉపేక్షించేది లేదు అంటూ వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో నారా లోకేష్ మాత్రం ఈ సంఘటన పట్ల జగన్ ను విమర్శించడం మొదలు పెట్టాడు. కొండా రెడ్డి అరెస్ట్ చేయడంతో నష్టం కలిగిందా… ఆయన్ను అరెస్ట్ చేయకుండా ఉండాల్సిందా అనేది ఏమీ చెప్పకుండా లోకేష్ అడ్డ దిడ్డంగా జగన్ పరిపాలనపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టాడు. లోకేష్ ఏ గొడవలో పడితే ఆ గొడవలో తలదూర్చి జగన్ ను విమర్శించాలనుకుంటే తన పరువే పోతుంది అంటూ మరోసారి ఆయనకు తెలియవచ్చింది.