Narayana : నాటకాల నారాయణ అడ్డంగా దొరికి పోయాడు
Narayana : విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతూ పరీక్ష పేపర్ ను లీక్ చేసి అనూహ్యంగా పోలీసులకు చికిన నారాయణ సంస్థల అధినేత నారాయణ బుకాయిస్తున్నాడు. ఆయనకు తెలుగు దేశం పార్టీ మద్దతు తెలియజేస్తూ వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నారాయణ సంస్థల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఆయన్ను అసలు నారాయణ సంస్థలతో సంబంధమే లేదు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. నారాయణ సంస్థలతో సంబంధం లేదు కనుక బెయిల్ ఇవ్వాలంటూ కోర్టు కు విజ్ఞప్తి చేసి బెయిల్ తెచ్చుకున్నారు.
ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నారాయణ బెయిల్ పిటీషన్ ను రద్దు చేయాలని ఉన్నత కోర్టుకు వెళ్లింది. అక్కడ నారాయణ సంస్థలను నారాయణ నడిపిస్తున్నాడు అని చెప్పేందుకు పలు సాక్ష్యాధారాలను సేకరించడం జరిగింది. నారాయణ సంస్థ గతంలో సోషల్ మీడియా ద్వారా.. వెబ్ మీడియా ద్వారా తమ కాలేజ్ కు సంబంధించిన ప్రచారం ను నిర్వహించింది. అందులో నారాయణను ముందు ఉంచి మరీ పబ్లిసిటీ చేయడం జరిగింది. నారాయణ ఫోటోలు మరియు వీడియోలను ఆ అడ్వర్ట్‌టైజ్మెంట్స్ కు వినియోగించారు.ఇటీవల ఈటీవీ లో ప్రసారం అయిన న్యూస్ లో నారాయణ ఇంటర్య్వూ ఇచ్చాడు. అందులో నారాయణ సంస్థల చైర్మన్ అంటూ వేయడం జరిగింది.

Narayana drama bail tenth class question paper leak case
అంటే ఏ సంబంధం లేకుడానే అలా ఎలా వేస్తారు.. సంస్థకు సంబంధం లేకుండా ఎందుకు ఆయన ప్రమోషన్ కార్యక్రమాల్లో పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కోర్టు ముందు ఉంచితే ఖచ్చితంగా ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కేసు సక్రమంగా విచారణ జరగాలంటే కచ్చితంగా ఆయన్ను జైల్లో ఉంచాలి అనేది పోలీసుల అభిప్రాయం. నారాయణ తో నారాయణకు సంబంధం లేదు అంటే చిన్న పిల్లలు కూడా నమ్మరు. కనుక నారాయణ కు పై కోర్టు లో చుక్కెదురు అవ్వడం ఖాయం.