Krishnapatnam Ayurvedic Medicine : అసలు ఎవరీ కృష్ణపట్నం ఆనందయ్య? ఆయన నిజంగా ఆయుర్వేద నిపుణుడేనా?
Krishnapatnam Ayurvedic Medicine : ప్రస్తుతం దేశమంతా అటే చూస్తోంది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉన్న కృష్ణపట్నం నేడు జనాలతో కిక్కిరిసిపోతోంది. ఇదివరకు అసలు కృష్ణపట్నం ప్రాంతాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించేవాడు కాదు. కానీ.. ఇప్పుడు వేలల్లో జనాలు, వేలల్లో వాహనాలు.. ఎక్కడ చూసినా అంబులెన్స్ లు… ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా జనాలు.. వీళ్లంతా అక్కడికి వెళ్లేది కరోనా మందు కోసం.. కరోనాను వెంటనే తగ్గించే ఆయుర్వేద మందును కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య అందిస్తున్నాడు. గత వారం పది రోజుల నుంచి ఆయన కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లకు ఆయుర్వేద మందును అందిస్తున్నాడు. దాన్ని తీసుకున్న ఒకటి రెండు రోజుల్లోనే కరోనా నెగెటివ్ వస్తోంది. కరోనా రానివారు.. ఆ మందు వేసుకుంటే వాళ్లకు జన్మలో కూడా కరోనా రావడం లేదు. ఆక్సిజన్ లేవల్స్ పడిపోయినా కూడా వాళ్ల వద్ద మందు ఉంది. ఇలా ఐదు రకాల మందులను ఆనందయ్య తయారు చేస్తున్నారు. ఇప్పటికి కొన్ని లక్షల మందికి ఆనందయ్య తన కరోనా మందును ఉచితంగా అందించారు.

nellore krishnapatnam corona ayurvedic medicine anandayya
Krishnapatnam Ayurvedic Medicine : నిజంగా ఆయుర్వేదానికి కరోనాను తగ్గించే శక్తి ఉందా?
కరోనా మన దేశంలోకి ప్రవేశించి సంవత్సరంనర అవుతోంది. ఇప్పటి వరకు కరోనాకు వ్యాక్సిన్లు, ఇతర ఇంజెక్షన్లు వచ్చాయి కానీ.. ఆయుర్వేదానికి సంబంధించిన ఏ మందు రాలేదు. కానీ.. కృష్ణపట్నం ఆనందయ్య మాత్రం కరోనాను ఆయుర్వేద మందును కనిపెట్టారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా.. ఉచితంగా ఆయన మందును అందిస్తుండటంతో చాలామంది జనాలు అక్కడికి వెళ్లి మందును తెచ్చుకుంటున్నారు. కరోనా వచ్చినవాళ్లు చాలామంది ఆ మందును వాడి నయం చేసుకుంటున్నారు. ఎంత తీవ్రమైన కేసు అయినా సరే.. కరోనా చివరి స్టేజ్ లో ఉన్నవాళ్లు, ఆక్సిజన్ లేవల్స్ పడిపోయిన వాళ్లకు కూడా వెంటనే ఆక్సిజన్ లేవల్స్ పెరిగిపోతున్నాయి.
Krishnapatnam Ayurvedic Medicine : అసలు.. ఎవరీ ఆనందయ్య?
అయితే.. ప్రస్తుతం అందరికీ తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే. అసలు ఈ ఆనందయ్య ఎవరు. ఇప్పుడే కరోనాకు మందు ఎందుకు తయారు చేశారు. గత సంవత్సరం కూడా కరోనా వచ్చింది కదా. అప్పుడు ఎందుకు తయారు చేయలేదు. అసలు ఆయన కరోనా మందు కోసం ఏం వాడతారు.. అనే ప్రశ్నలు అందరినీ తొలుస్తుంటాయి. ఆనందయ్యది నెల్లూరు జిల్లా కృష్ణపట్నమే. గత సంవత్సరం.. ఆనందయ్యకు గత సంవత్సరం.. తమిళనాడుకు చెందిన ఓ ఆయుర్వేద డాక్టర్ పరిచయం అయ్యాడట. అప్పుడు ఆనందయ్యకు కొన్ని మూలికల మిశ్రమంతో కరోనా తగ్గుతుందని చెప్పాడట. అయితే.. గత సంవత్సరం కూడా ఆనందయ్యకు కరోనా రావడంతో.. ఆ ఆయుర్వేద డాక్టర్ చెప్పిన మూలికల మిశ్రమాన్ని తన మీదే ప్రయోగించుకున్నాడట ఆనందయ్య. ఆమిశ్రమాన్ని తిన్న రెండు రోజులకే తనకు కరోనా నయం అయిందట. దీంతో మరింత మిశ్రమాన్ని తయారు చేసి.. తన బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు అందించాడట. వాళ్లందరు కూడా కరోనాను జయించారట. దీంతో తన మిత్రులు, బంధువులతో కలిసి.. కృష్ణపట్నంలో కరోనా సోకిన వాళ్లను కాపాడాలనే సదుద్దేశంతో ఈ సంవత్సరం కరోనాకు మందును తయారు చేస్తూ ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారట.
Krishnapatnam Ayurvedic Medicine : కృష్ణపట్నం ఊరిలో ఒక్క కరోనా కేసు లేదట
ముందు తన సొంత ఊరు కృష్ణపట్నంలో ఉన్న 11 వేల మంది ప్రజలకు ఉచితంగా కరోనా మందును అందించాడట ఆనందయ్య. దాన్ని తీసుకున్న తర్వాత ఆ ఊరి ప్రజల్లో ఇప్పటి వరకు ఒక్కరికి కరోనా రాలేదట. అంతే కాదు.. ఆ ఊళ్లో ఎక్కడ కూడా మాస్క్ పెట్టుకోరట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేని మందు కాబట్టి.. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా ఈ మందును తీసుకోవచ్చు కానీ.. గర్భిణీ మహిళలు, బహిష్టు వచ్చిన మహిళలు మాత్రం ఈ మందును వాడొద్దని.. ఈ మందు తిన్న తర్వాత కొన్ని రోజులు పత్యం పాటించాలని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
Krishnapatnam Ayurvedic Medicine : కరోనా ఆయుర్వేద మందులో వాడే వన మూలికలు ఇవే
కరోనా ఆయుర్వేద మందు తయారు చేయడం కోసం.. ఆనందయ్య వాడే వన మూలికలు ఇవేనట. అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరాయాలు, పట్టా, లవంగాలు, వేప ఆకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి చెట్టు, కొండ పల్లేరు కాయల చెట్టు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింట ఆకుల చెట్టు, తెల్లజిల్లేడు పూల మొగ్గలు, ముళ్ల వంకాయలు. వీటితో చేసిన మిశ్రమమే అది. ఇవన్నీ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యమైనవి. వీటిలో చాలా పదార్థాలను మనం రోజూ తింటూనే ఉంటాం. వీటిలో దేన్ని తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి.. ఆ మిశ్రమం వల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆనందయ్య చెబుతున్నారు.